స్కిల్ దేవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చింది. ఈ కేసులో చంద్రబాబును A1 గా పేర్కొంటూ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి సంబంధించిన నిధులను దుర్వినియోగం చేశారన్న అభియోగాల నేపథ్యంలో కేసు నమోదు చేసిన సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ కేసులో మొత్తం 41మందిని నిందితులుగా పేర్కొంది సీఐడీ. చంద్రబాబుతో సహా అచ్చెన్నాయుడు,అప్పటి ఏపీఎస్ఎస్డీ ఎండీ గంటా సుబ్బారావు, డైరెక్టర్ కే. లక్ష్మీనారాయణ, సీమెన్స్, డిజైన్ టెక్, పీవీఎస్పీ స్కిలర్ సంస్థల అధికారు ప్రతినిధులను కూడా సీఐడీ ఛార్జ్ షీట్లో పేర్కొంది. ఈ స్కామ్ లో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్ర కూడా ఉన్నట్లు తెలిపింది సీఐడీ.
ఈ స్కామ్ సీమెన్స్, డిజైన్ టెక్ సంస్థలకు 371కోట్ల రూపాయల నిధులు మళ్లించారని ఆరోపించింది సీఐడీ.ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ విషయంలో 2021 డిసెంబర్ 9న సీఐడీ కేసు నమోదు చేసింది.ఆ తర్వాత 2023 సెప్టెంబర్ 9న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఏసీబీ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం ఇలాంటి కేసుల్లో గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉందని, స్కిల్ స్కామ్ కేసు విషయంలో గవర్నర్ అనుమతి లేనందున ఈ ఛార్జ్ షీట్ ను రిటర్న్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.