
- సత్తుపల్లి ఐడీబీఐ బ్యాంకులో ఫేక్ డాక్యుమెంట్లతో లోన్ల కేసులో సీఐడీ ఫురోగతి
సత్తుపల్లి, వెలుగు : ఖమ్మం జిల్లో ఫేక్ డాక్యుమెంట్లతో బ్యాంకు లోన్ల తీసుకున్న కేసును సీఐడీ అధికారులు ఛేదించారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఐడీబీఐ బ్యాంకులో ఫేక్ డాక్యుమెంట్లతో లోన్లు పొందిన కేసును బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ పీహెచ్ హషీం అంతర్గత విచారణలో నిందితులను గుర్తించి సీఐడీకి కంప్లయింట్ చేశారు. 2015 –- 2016 సంవత్సరంలో 279 మంది రైతులకు రూ.2.61 కోట్లు కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్ ద్వారా రుణాలు అందజేశారని, మరో 26 మందికి రూ.25 లక్షలు మైక్రో లోన్స్ స్కీమ్ ద్వారా అందజేసినట్లు సీఐడీ అధికారులు దర్యాప్తులో గుర్తించారు.
అప్పుటి బ్యాంకు మేనేజర్ నల్లగొపుల రమేశ్ తో పాటు అతనికి సహకరించిన బిజినెస్ కరస్పాండెంట్లు చెట్టిపోగు సురేశ్, తాటి చంద్రరావు, మేరుగు శివకృష్ణపై కేసు నమోదు చేశారు. సీఐడీ డైరెక్టర్ జనరల్ శిఖగోయల్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన సీఐడీ అధికారులు గురువారం బ్యాంక్ బిజినెస్ కరస్పాండెంట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసి చెట్టు పోగు సురేశ్ ను అరెస్టు చేశారు. ఐపీసీ 406, 409,420,468,471,4 77 (ఏ) 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్ కు పంపినట్లు ఇన్ స్పెక్టర్ రాము తెలిపారు.