
అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలుపై తనిఖీలు
మాదాపూర్, వెలుగు : ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ ఆఫీసులో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. మాదాపూర్‌లో మెలాంజ్ టవర్స్‌లోని పదో ఫ్లోర్లో ఉన్న ఎన్ఎస్పీఐఆర్ఏ అఫీస్‌కు దాదాపు 40 మంది ఏపీ సీఐడీ అధికారుల బృందం మంగళవారం ఉదయం 10 గంటలకు చేరుకొని సోదాలు చేసింది. అమరావతిలో అసైన్డ్ భూముల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలపై 40 మంది అధికారుల బృందం తనిఖీలు చేసింది.
నారాయణ విద్యా సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థల్లోకి నిధుల మళ్లింపు, ఆ నిధులతోనే నారాయణ బినామీ పేర్లతో భూములు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో సీఐడీ అధికారులు సోదాలు చేసినట్లు తెలిసింది. ఆఫీసులోపనిచేస్తున్న పలువురు ఉద్యోగులను వారు ప్రశ్నించారు. కంపెనీకి చెందిన 40 హార్డ్‌డిస్కులను స్వాధీనం చేసుకున్నారు.