ఫ్రెంచ్ ఫ్రైస్లో సిగరెట్లు..గమనించకపోతే..అంతే సంగతులు

ఫ్రెంచ్ ఫ్రైస్లో సిగరెట్లు..గమనించకపోతే..అంతే సంగతులు

మీరు ఫ్రెంచ్ ఫ్రైస్ను ఏం చేస్తారు..తింటాం అంటారా..? కానీ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను తాగాలి..అదేంటి ఫ్రెంచ్ ఫ్రైస్ను ఎలా తాగుతారు అనుకుంటున్నారా..? ఆ విషయం మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ వాళ్లే చెప్పాలి. ఎందుకంటే..ఈ మధ్య మెక్ డొనాల్డ్స్ తయారు చేసే ఫ్రెంచ్ ఫ్రైస్లో సిగరెట్ పీకలు కూడా ఉంటున్నాయి. అందుకు ఈ వీడియోనే ఉదాహరణ. అసలు విషయం ఏంటంటే..

Aslo Read :- కేరళలో టీ స్టాల్ నడుపుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్

ఇంగ్లాండ్ లోని బారో ఇన్ ఫర్నెస్ ప్రాంతంలో మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ నుంచి జెమ్మా కిర్క్ బోనర్ అనే మహిళ తమ పిల్లల కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ను ఆర్డర్ చేసింది. తన కొడుకుకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ను తినిపిస్తుండగా..ఒక్కసారిగా షాక్కు గురైంది. అందులో సిగరెట్ ను గమనించింది. అది సగం కాలిపోయింది. సిగరెట్తో పాటు..అందులో సిగరెట్ బూడిద కూడా ఉంది. వెంటనే ఈ విషయాన్ని బాధితురాలు సోషల్ మీడియాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. 

అసహ్యంగా..కోపంగా..

మెక్ డొనాల్డ్స్ రెస్టారెంట్ నుంచి వచ్చిన ఫ్రెంచ్ ఫ్రైస్ ప్యాకెట్ను నేను ఏడాది వయస్సున్న కొడుకు తినిపిస్తున్నా. ఒక్కొక్కటి తీస్తూ వాడి నోటికి అందిస్తున్నా. ఈ సమయంలో నేను లోపల గమనించలేదు. అయితే ఒక్కసారిగా సిగరెట్ పీక నా చేతికి అందింది. అది తినిపించే సమయానికి గమనించా. ఒక్కసారిగా షాక్ కు గురయ్యా. ..అని బాధితురాలు జెమ్మా కిర్క్ బోనర్ ఫేస్ బుక్ లో పేర్కొంది.