ప్రముఖ నటుడు, టాలీవుడ్ లో రారాజుగా పేరుతెచ్చుకున్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
మెగాస్టార్ చిరంజీవి
ఆయన రెబల్ స్టార్ కి నిజమైన నిర్వచనం. కేంద్ర మంత్రిగానూ ఎన్నో సేవలందించారు. ఆయన లేని లోటు వ్యక్తిగతంగా నాకూ, సినీ పరిశ్రమకూ లక్షలాది మంది అభిమానులకు ఎప్పటికీ తీరనిది. ఆయన ఆత్మ శాంతించాలని ప్రార్థిస్తూ... ఆయన కుటుంబ సభ్యులందరికీ, నా తమ్ముడి లాంటి ప్రభాస్ కి నా సంతాపం తెలియజేసుకుంటున్నారు.
Rest In Peace Rebel Star ! pic.twitter.com/BjSKeCbIMR
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 11, 2022
నందమూరి బాలకృష్ణ
మంచితనానికి మారుపేరైన కృష్ణంరాజు గారి మరణం తీవ్రంగా కలిచివేసింది. సినీ, రాజకీయ రంగాలలో కృష్ణంరాజు గారిది చెరగని ముద్ర. విలక్షణ నటనతో ప్రేక్షకుల మదిలో రెబల్ స్టార్ గా శాశ్వత స్థానం సంపాదించి ఎందరికో ఆదర్శంగా నిలిచారు కృష్ణంరాజు గారు. కృష్ణంరాజు గారితో కలసి రెండు చిత్రాలలో నటించడం ఎప్పటికీ మర్చిపోలేని గొప్ప అనుభవం. కృష్ణంరాజు గారితో మా కుటుంబానికి మంచి అనుబంధం ఉంది. కృష్ణరాజు గారు అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశాను. ఆయన ఆరోగ్యం గురించి తరచూ తెలుసుకునేవాడిని. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.
మహేశ్ బాబు
నాకు మరియు మొత్తం పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజు. ఆయన జీవితం, సినిమా రంగానికి ఆయన చేసిన ఎనలేని కృషి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ కష్ట సమయంలో ప్రభాస్‌కి, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
Shocked to learn that Krishnam Raju garu is no more... A very sad day for me and the entire industry. His life, his work and his immense contribution to cinema will always be remembered. My deepest condolences to Prabhas and the entire family during this difficult time ?
— Mahesh Babu (@urstrulyMahesh) September 11, 2022
పవన్ కళ్యాణ్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటులు శ్రీ కృష్ణంరాజు గారు. రౌద్ర రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన శ్రీ కృష్ణంరాజు గారు తుదిశ్వాస విడిచారనే వార్త దిగ్భ్రాంతి కలిగించింది. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించాను. శ్రీ కృష్ణంరాజు గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. మా కుటుంబంతో శ్రీ కృష్ణంరాజు గారికి స్నేహసంబంధాలు ఉన్నాయి. 1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో శ్రీ కృష్ణంరాజు గారితో కలసి అన్నయ్య శ్రీ చిరంజీవి గారు నటించారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారు. ‘భక్త కన్నప్ప’లో శ్రీ కృష్ణంరాజు గారి అభినయం ప్రత్యేకం. అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారు. బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం లాంటి చిత్రాలు ఆయన శైలి నటనను చూపాయి. ప్రజా జీవితంలోనూ ఆయన ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా సేవలందించారు. ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరఫున బరిలో నిలిచారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. శ్రీ కృష్ణంరాజు గారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.
జూనియర్ ఎన్టీఆర్
కృష్ణంరాజు గారు మృతి చెందడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. అతని ఆత్మకు శాంతి కలుగుగాక.
Deeply saddened by Krishnam Raju Garu's passing away. I extend my heartfelt condolences to his family. May his soul rest in peace…
— Jr NTR (@tarak9999) September 11, 2022
అనుష్క శెట్టి
Rest in peace our very own Krishnam raju garu … a legend a soul with the biggest heart ..U will live on in our hearts ?????????????????? pic.twitter.com/hjUs7kyk4d
— Anushka Shetty (@MsAnushkaShetty) September 11, 2022
సాయి ధరమ్ తేజ్
Saddened to hear about the sudden passing on of #KrishnamRaju garu.
— Sai Dharam Tej (@IamSaiDharamTej) September 11, 2022
Your contribution to the industry is irreplaceable sir.May your soul rest in peace.
My Heartfelt condolences to his family members and the dearest ones…Om Shanti ??
మోహన్ బాబు
I am at loss of words! #KrishnamRaju my brother.
— Mohan Babu M (@themohanbabu) September 11, 2022
శర్వానంద్
Heartbreaking news ??
— Sharwanand (@ImSharwanand) September 11, 2022
Om Shanti Krishnam Raju sir ??
My thoughts and prayers with Prabhas anna and the entire family ?? pic.twitter.com/yvtabWFARk
నిఖిల్ సిద్దార్థ
A Legend Has left us… A man with a Heart of Gold.. Rest in Peace sir ?????? will miss your Presence and Motivational words always… @UVKrishnamRaju #KrishnamRaju ?? pic.twitter.com/0a4bhAik0r
— Nikhil Siddhartha (@actor_Nikhil) September 11, 2022
మంచు మనోజ్
This can’t be true. Such a great human being ?? we will miss you dearly sir. Ur contribution to the film industry and the society Wil live on forever and ever. Om Shanti #KrishnamRaju garu. We will love you forever?? pic.twitter.com/RwgAFG8GaM
— Manoj Manchu??❤️ (@HeroManoj1) September 11, 2022
మంచు విష్ణు
#NewProfilePic pic.twitter.com/XaVF5hGhug
— Vishnu Manchu (@iVishnuManchu) September 11, 2022
