కంగ్రాచులేషన్స్.. కొంచమైనా సిగ్గుండాలి: సినీ క్రిటిక్‌ కేఆర్కే

కంగ్రాచులేషన్స్.. కొంచమైనా సిగ్గుండాలి: సినీ క్రిటిక్‌ కేఆర్కే

బాలీవుడ్ పాపులర్ సినీ క్రిటిక్‌ కేఆర్కే నటుడు ఆశిష్ విద్యార్థి పెళ్లిపై సంచలన కామెంట్స్ చేసాడు. ఒకవైపు కంగ్రాట్స్ చెబుతూనే మరోవైపు.. కొంచెమైనా సిగ్గుండాలి భాయ్‌సాబ్ అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. ప్రస్తుతం  కేఆర్కే ఈ ట్వీట్స్ నేట్టింత వైరల్ గా మారాయి. తాజాగా ఆశిష్ విద్యార్థి గౌహాతికి చెందిన ఓ వ్యాపారవేత్త రూపాలి బరువాను కోల్‌కతాలో రెండో పెళ్లి చేసుకున్నాడు. అతికోద్ది మంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో ఈ జంట రిజిస్టర్ పెళ్లి చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 

ఇక ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లిపై చాలా మంది చాలా రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. కొంతమంది ఆయనకు మద్దతు పలుకుతుంటే, మరికొంత మంది ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ పాపులర్ సినీ క్రిటిక్‌ కేఆర్కే కూడా తనదైన స్టైల్లో స్పందించాడు. "60 ఏళ్ళ నటుడు ఆశిష్ విద్యార్థి రెండో పెళ్లి చేసుకున్నందుకు శుభాకాంక్షలు.. కొంచమైనా  సిగ్గుండాలి భాయ్‌సాబ్" అంటూ కామెంట్స్ చేసాడు. ఇక కేఆర్కే చేసిన ఈ ఈ ట్వీట్‌పై నెటిజన్స్ కౌంటరిస్తున్నారు. ఈ జంటను చూసి నువ్వు ఓర్వలేకపోతున్నావ్? అంటూ రెచ్చిపోతున్నారు. మరి కేఆర్కే చేసిన ఈ ట్వీట్స్ పై   ఆశిష్ విద్యార్థి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.