
కోలీవుడ్ హీరోయిన్ కీర్తి పాండియన్ ఇటీవల హీరో అశోక్ సెల్వన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ‘తుంబా’ సినిమాతో ఆమె సినీ ప్రయాణం మొదలైంది. ఆ సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది. అయితే, అందుకు తన రూపు రేఖలే ప్రధాన కారణం అని ఇటీవల ఈ నటి తెలిపింది. తాను సౌత్‌లో సినిమాల కోసం ట్రై చేస్తున్న టైంలో ఈ కారణాలు చెప్పి తనకు చాన్స్‌లు ఇచ్చేవారు కాదని తెలిపింది.
పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బడా డైరెక్టర్ గురించి ప్రస్తావిస్తూ.. ‘నువ్వు ఇంత సన్నగా ఉంటే ప్రేక్షకులు నీ సినిమాలు ఎందుకు చూస్తారు.. నువ్వు హీరోయిన్గా పనికిరావు’ అని మొహం మీదే చెప్పేశాడని తెలిపింది. ఆ మాటలు విని తన కళ్లలో నీళ్లు తిరిగాయని కీర్తి గుర్తుచేసుకుంది. తన బలహీనతలను అధిగమించి ఇప్పుడు తన బాడీ పట్ల కాన్ఫిడెంట్‌గా ఉన్నట్టు వివరించింది.