
వాషింగ్టన్: పోర్న్ స్టార్‌గా పేరొందిన మియా ఖలీఫా ఇజ్రాయెల్– పాలస్తీనా యుద్ధంపై చేసిన కామెంట్స్ ఆమెను అగాథంలోకి నెట్టాయి. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ హమాజ్ మిలిటెంట్లు అక్కడి పౌరులను ఊచకోత కోస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ప్రపంచమంతా ఈ దుష్టఖాండపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. మియా ఖలీఫా మాత్రం పాలస్తీనియన్లపే స్వాతంత్ర్య సమరయోధులుగా పేర్కొంటూ పోస్టుచేసింది.
దీంతో ఆమెను పలు వ్యాపార సంస్థలు ఒప్పందం నుంచి తొలగించాయి. ‘మీ వ్యాఖ్యలు చాలా భయంకరమైనవి. దయచేసి మనిషిలా ఆలోచించండి. శాంతిని నెలకొల్పడానికి బదులు విద్వేషాలను రెచ్చగొట్టకండి.. మిమ్మల్ని బిజినెస్ డీల్ నుంచి తప్పిస్తున్నాం’ అని పలు సంస్థలు మండిపడ్డాయి. అయినా వెనక్కి తగ్గనంటూ ఈ నటి మరో పోస్టు పెట్టింది.