
నేషనల్ క్రష్ రష్మిక తాజా పోస్టర్ ఒకటి వైరల్‌గా మారింది. ఆమె బాలీవుడ్లో ‘యానిమల్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నుంచి ‘అమ్మాయి..’ అనే సాంగ్‌ను రేపు మూవీ టీం లాంచ్ చేయనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్లో రష్మిక, రణ్‌బీర్ కపూర్ల మధ్య గాఢమైన లిప్‌లాక్‌ను రిలీజ్ చేసింది. ఆకాశంలో విహరిస్తూ ప్రపంచాన్ని మరిచి వీరిద్దరూ ప్రేమలో మునిగిపోయినట్టుగా ఉన్న ఈ పోస్టర్ ట్రెండింగ్‌గా మారింది.
గతంలో విజయ్‌దేవరకొండతో ‘డియర్ కామ్రేడ్’ కోసం రష్మిక లిప్‌లాక్ సీన్లో కనిపించింది. తాజా పోస్టర్ చూసిన వారంతా బాలీవుడ్ హీరోయిన్లకు రష్మిక ఏమాత్రం తీసిపోవడం లేదని కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్లోనూ రష్మిక చాలా అందంగా కనిపించి ఆకట్టుకుంది. దీంతో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.