శాండ్విచ్​ తిని ఆస్పత్రి పాలైన హీరోయిన్​

శాండ్విచ్​ తిని ఆస్పత్రి పాలైన హీరోయిన్​

ముంబై: బాలీవుడ్​ నటి షెహనాజ్​ గిల్​ తన అభిమానులను కంగారు పెట్టింది. ఇటీవల ఆమె ముంబైలోని కోకిలాబెన్​ ఆస్పత్రిలో చేరింది. ఆమెను చూసేందుకు సెలబ్రిటీలు ఆస్పత్రికి చేరుకోవడంతో ఫ్యాన్స్​ టెన్షన్​ పడ్డారు. దీంతో షెహనాజ్​ లైవ్​ చాట్​లో తన ఆరోగ్య పరిస్థితిని వెల్లడించింది. తాను శాండ్​విచ్​ తిన్నానని.. ఆ తర్వాత స్టమక్​ ఇన్ఫెక్షన్​కు గురయ్యానని ఆమె తెలిపింది.

ALSO READ : పవన్ కల్యాణ్కు వైరల్ ఫీవర్

ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఎవరూ కంగారు పడొద్దని చెప్పింది. ప్రస్తుతం ఆమె ‘థాంక్యూ ఫర్​ కమింగ్’​ అనే బాలీవుడ్​ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ ప్రమోషన్​లోనే తాను తీసుకున్న ఆహారం వికటించడంతోనే ఈ పరిస్థితి వచ్చినట్టు పేర్కొంది.