సినిమా అంటేనే ఎమోషన్

సినిమా అంటేనే ఎమోషన్

దిల్ బేచారా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ చివరి సినిమా. రీసెంట్‌ గా ‘డిస్నీ ప్లస్ హాట్‌ స్టా ర్’ లో రిలీజ్ అయితే కొన్ని కోట్ల మంది చూశారు. ఆ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌‌‌‌‌‌‌‌కి ఘనంగా నివాళి ఇచ్చారు. ఓ వైపు ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ట్రెండ్ నడిచింది. ఇంకోవైపు రివ్యూల దెబ్బకి ఐఎండీబీ (9.5 రేటింగ్) రికార్డ్ బద్దలు అయింది. మన దగ్గర ఇప్పటిదాకా ఏ సినిమాకు కూడా దిల్ బేచారాకి వచ్చినంత యునానిమస్‌‌‌‌‌‌‌‌గా పాజిటివ్‌ రివ్యూలు రాలేదు. అసలు ఒక సినిమాకు ఆడియెన్స్ ఇంతలా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా? అంటే.. అందుకు కారణాలున్నాయని అంటున్నారు సైకాలజిస్టులు.

ఒక విషయంలో ఎంతగా లీనమైతే.. అది ఆ వ్యక్తిని అంత గా ప్రభావితం చేస్తుంది. సినిమా అంటే ఎంటర్‌ టైన్మెంట్ మాత్రమే కాదు.. మనిషి కాన్ సంట్రేషన్ తనవైపు మళ్లించుకోగలిగే కెపాసిటీ ఉంది దానికి. అందుకే సినిమాలో లీనమైతే ఆ ట్రాన్స్ నుంచి బయటకి రావడానికి ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కి టైం పడుతుంది అని సైకాల జిస్ట్ నుపుర్ ధాకే పాల్కర్చె బుతున్నారు. ‘‘ ఒక సినిమా చూస్తున్నంత సేపు.. నవ్వు, ఏడుపు, జోష్, ఎగ్జయిట్‌‌‌‌‌‌‌‌మెంట్, ఆశ్చర్యం , భయం, సంతోషం… ఇలా రకరకాల ఎమోషన్స్ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌కు కలుగుతాయి. సినిమా పూర్తయ్యాక నిమిషాలు,గంటలు, రోజులు.. ఒక్కోసారి ఏండ్ల తరబడి ఆ ఎమోషన్స్ క్యారీ చేస్తుంటారు. సుశాంత్ విషయంలో ‘ఒక మనిషి మన మధ్య లేడు’ అనే ఫీలిం గ్ ఆడియెన్స్‌‌‌‌‌‌‌‌లో బాగా పేరుకుపోయి ఉంది. అందుకే ‘దిల్ బేచారా’ విషయంలో ఆ కనెక్టివిటీ ఇంకా ఎక్కువగా అయింది’’ అని చెప్పారు నుపుర్.

నటన మనలోనూ..

హ్యూమన్ సైకాలజీ ప్రకారం.. ఎన్ని బాధలున్నా, సంతోషంగా ఉన్నట్లు నటిస్తే కొన్నాళ్లకు అదే అలవాటుగా మారుతుంది. భయాన్ని నటిస్తే.. భయం అలవాటు అవుతుంది. అదే విధంగా బాధ, కోపం, జాలి.. ఇలా ఏ ఫీలిం గ్స్ అయినా, ఆ పరిస్థితులు మనిషిని ఆ మూడ్ లోకి తీసుకెళ్తాయి. సుశాంత్ మరణం నిజంగా ఓ ట్రాజెడీ. సడన్ గా అతను లేడు అనే పరిస్థితిని అతని అభిమానులు చాలామంది తట్టుకోలేకపోయారు. ఆ మూడ్ లోనే ఇప్పుడు సినిమాను చూడటం వల్ల ఆ బాధ మరిం త పీక్స్‌‌‌‌‌‌‌‌కి చేరింది. సుశాంత్ లైఫ్ అర్థాం తరంగా ముగిసినట్లే.. సినిమా క్లైమాక్స్ లోనూ హీరో క్యారెక్టర్ చనిపోతుంది. దీంతో ఆడియెన్స్ బాగా ఎమోషనల్‌‌‌‌‌‌‌‌గా రియాక్ట్ అవుతున్నారు. అందుకే ‘దిల్ బేచారా’ కూడా ఎమోషనల్ హిట్టే అయ్యింది. అయితే సినిమాల్లో మాదిరి.. బయట అలాంటి సిచ్యుయేషన్ ఎదురైతే మాత్రం వాటిని జనాలు అంతగా పట్టించుకోరు. ఎందుకంటే.. సినిమాలు చూపించే ఎఫెక్ట్ టెంపరరీ మాత్రమే కాబట్టి.

అద్దంలా ఫీల్ కావడమే..

సినిమా అనేది ఆడియెన్స్‌ కు ఒక అద్దం లాంటిది. తెరపై క్యారెక్టర్స్ యాక్టింగ్ తో ఎమోషన్స్ పండిస్తుంటే.. దానికి సమానంగా ఆడియెన్స్ ఫీలింగ్స్ క్యారీ అవుతుంటాయి. ఆ ఎమోషన్స్ తమవే అని ఆడియెన్స్ ఫీలవుతుంటారు కాబట్టి. ముఖ్యం గా బాధాకరమైన సీన్లు, సెంటిమెంట్ సీన్లు.. ఆడియెన్స్ ని మరింత ఎమోషనల్‌‌‌‌‌‌‌‌కు గురి చేస్తుంటాయి. దానికి తగట్లు బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ మరింత ఎఫెక్ట్ చూపిస్తుంది. కానీ, కొందరు మాత్రం సినిమాను.. సినిమాలాగే ఫీలవుతుంటారు.