ఏపీలో ఈ నెల 31 నుంచి సినిమా హాళ్లు రీ ఓపెన్

V6 Velugu Posted on Jul 29, 2021

ఆంధ్రప్రదేశ్ లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా మూతపడిన సినిమా థియేటర్లు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఈ నెల 31 నుంచి థియేటర్లు ఓపెన్ కానున్నాయి. ఇప్పటికే తెలంగాణలో రేపటి(శుక్రవారం) నుంచి సినిమా హాళ్లు తెరుచుకోనున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా ఈ నెల 31 నుంచి సినిమా థియేటర్లలో ప్రదర్శనలకు అనుమతి ఇచ్చింది. అయితే.. 50 శాతం సీటింగ్ తోనే ప్రదర్శనలు జరుపుకోవాలని స్పష్టం చేసింది. మాస్కులు, శానిటైజర్లు, భౌతికదూరం వంటి కరోనా మార్గదర్శకాలు పాటించడం తప్పనిసరి అని తెలిపింది.

ఇటీవల కర్ఫ్యూ సమయాల సడలింపులు ఇచ్చే సందర్భంలోనే థియేటర్ల రీ ఓపెనింగ్ కు  ప్రభుత్వం గ్రీన్ సిగ్నలిచ్చింది. అయితే, నిర్మాతలతో ఎగ్జిబిటర్ల వివాదం ఓ కొలిక్కిరాకపోవడంతో థియేటర్లు తెరుచుకోవడం ఆలస్యమైంది. కాగా.. 50 శాతం సీటింగ్ తో సినిమా ప్రదర్శనలు తమకు లాభదాయకం కాదని థియేటర్ల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
 

Tagged AP, Cinema theaters, July 31, reopen

Latest Videos

Subscribe Now

More News