అవార్డులు నా బాధ్యతను పెంచాయి

అవార్డులు నా బాధ్యతను పెంచాయి

‘అర్జున్ చక్రవర్తి’ చిత్రానికి గానూ అంతర్జాతీయ స్థాయిలో నాలుగు అవార్డులు రావడం ఆనందంగా ఉందని చెప్పాడు సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌ జగదీష్‌‌‌‌ చీకటి.  ఇటీవల ఈ చిత్రం విడుదలైన నేపథ్యంలో జగదీష్‌‌‌‌ మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ ‘ఫోటోగ్రఫీలో మాస్టర్స్‌‌‌‌ చేసి దూరదర్శన్‌‌‌‌లో కెరీర్‌‌‌‌‌‌‌‌ ప్రారంభించిన నేను.. ఆ జాబ్ వదిలేసి వందకు పైగా షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీస్‌‌‌‌,  పలు యాడ్స్‌‌‌‌కు వర్క్ చేశా. ‘జత కలిసే’ నా ఫస్ట్ మూవీ. నాయకి, భైరవ గీత,  జోహార్‌‌‌‌‌‌‌‌, అర్జున ఫల్గుణ,  చోర్ బజార్, కోట బొమ్మాళి పీఎస్‌‌‌‌ చిత్రాలకు వర్క్ చేశా.

‘భైరవ గీత’లో నా వర్క్‌‌‌‌ నచ్చి దర్శకుడు విక్రాంత్‌‌‌‌ రుద్ర ‘అర్జున్‌‌‌‌ చక్రవర్తి’ కోసం సంప్రదించారు.  వరల్డ్ క్లాస్ స్టాండర్డ్స్‌‌‌‌తో తెరకెక్కించాలని ముందే  ప్లాన్ చేశాం. పాత్ర తీరు, హీరో జర్నీకి తగ్గట్టుగా కలర్‌‌‌‌‌‌‌‌ వేరియేషన్స్‌‌‌‌ చూపిస్తూ మూడు కెమెరాలతో షూట్ చేశాం. హాలీవుడ్‌‌‌‌ స్థాయి లుక్‌‌‌‌ వచ్చేందుకు నేచురల్‌‌‌‌ లైటింగ్‌‌‌‌లో షూట్ చేశాం.  విజన్ డిఫరెన్స్ కోసం ఎన్ మోర్ఫిక్, స్పెరికల్ లెన్స్‌‌‌‌లను వాడాం.  ఒక డీవోపీ టెక్నికల్‌‌‌‌గా ఎంత అప్‌‌‌‌డేటెడ్‌‌‌‌గా ఉన్నప్పటికీ దర్శకుడితో సింక్ కుదిరితేనే అవుట్‌‌‌‌పుట్‌‌‌‌ బాగుంటుంది.  

ఆ సినిమా విషయంలో  దర్శకుడు విక్రాంత్‌‌‌‌తో పాటు  హీరో విజయ్ రామరాజు, నిర్మాత శ్రీని గుబ్బల చాలా సపోర్ట్ చేశారు. అంతర్జాతీయ స్థాయి అవార్డులతో పాటు టాలీవుడ్ సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా రావడం ఒక సినిమాటోగ్రాఫర్‌‌‌‌‌‌‌‌గా నా బాధ్యతను మరింత పెంచాయని భావిస్తున్నాను’ అని చెప్పాడు.