Shaheen Afridi: కోహ్లీ, రోహిత్ కంటే అతడిని ఔట్ చేయడం చాలా కష్టం: పాకిస్థాన్ స్టార్ పేసర్

Shaheen Afridi: కోహ్లీ, రోహిత్ కంటే అతడిని ఔట్ చేయడం చాలా కష్టం: పాకిస్థాన్ స్టార్ పేసర్

ప్రస్తుత జనరేషన్ లో బెస్ట్ బౌలర్ల లిస్ట్ లో పాకిస్థాన్ స్టార్ పేసర్ షహీన్ అఫ్రిది కూడా ఒకడు. స్వింగ్, యార్కర్లతో ఇప్పటికే ప్రపంచానికి తానేంటో నిరూపించుకున్నాడు. టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను సైతం అఫ్రిదీ బోల్తా కొట్టించాడు. తనదైన రోజున తన మొదటి స్పెల్ తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తాడు. ప్రస్తుతం ఆసియా కప్ కోసం సిద్ధమవుతున్న ఈ పాక్ పేసర్ తన కెరీర్ లో ఔట్ చేయడానికి అత్యంత కఠిన బ్యాటర్ ఎవరో చెప్పుకొచ్చాడు. కోహ్లీ, రోహిత్ కాకుండా సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ పేరు చెప్పడం విశేషం. 

సౌతాఫ్రికా మాజీ ఓపెనర్, బ్యాటింగ్ లెజెండ్ హషీమ్ ఆమ్లాను అత్యంత కఠిన బ్యాటర్ గా ఎంచుకున్నాడు. తాను ఆడే రోజుల్లో ఆమ్లాను ఔట్ చేయడానికి చాలా కష్టపడేవాడినని తెలిపాడు. " నేను ఆమ్లాతో టెస్ట్, వన్డే మ్యాచ్ లు ఆడాను. అతన్ని ఔట్ చేయడం చాలా ఛాలెంజింగ్ గా అనిపించేది. ఇటీవలే ఇంగ్లాండ్‌లో జరిగిన వైటాలిటీ టీ20 బ్లాస్ట్‌లో ఆమ్లాతో ఒక మ్యాచ్ ఆడాను. నేను చుసిన వాళ్లలో గొప్ప బ్యాటర్. అతను ఏం చేయాలనుకుంటాడో పక్కాగా చేస్తాడు". అని అఫ్రిది ఒక పోడ్ కాస్ట్ లో తెలిపాడు. అఫ్రిది వన్డే కెరీర్ లో ఆమ్లాను రెండు సార్లు ఔట్ చేశాడు. 

►ALSO READ | IND vs AUS: కుర్రాళ్లకు కెప్టెన్‌గా శ్రేయాస్.. ఆస్ట్రేలియా 'ఎ' సిరీస్‌కు భారత 'ఎ' జట్టు ప్రకటన

42 ఏళ్ల ఆమ్లా 15 ఏళ్ల ఇంటర్నేషనల్‌‌ కెరీర్‌‌లో అన్ని ఫార్మాట్‌‌ల్లో కలిపి 349 మ్యాచ్‌‌లాడి 18000 పైగా పరుగులు చేశాడు. ఇందులో 55 సెంచరీలు, 88 హాఫ్‌‌ సెంచరీలు ఉన్నాయి. 181 వన్డేల్లో 8113 పరుగులు చేశాడు. వీటిలో  27 సెంచరీలు, 39 హాఫ్ సెంచరీలున్నాయి. 124 టెస్టులు ఆడిన ఆమ్లా 9282 పరుగులు చేశాడు. ఇందులో  28 సెంచరీలుండగా, 41 హాఫ్ సెంచరీలున్నాయి. 44 టీ20ల్లో ఆమ్లా 8 హాఫ్ సెంచరీలతో 1277 రన్స్ చేశాడు. సౌతాఫ్రికా తరఫున అత్యధిక టెస్టు పరుగులు చేసిన రెండో ఆటగాడు హషీమ్ ఆమ్లా నిలిచాడు. ఇక అఫ్రిది విషయానికి వస్తే  పాకిస్థాన్ తరపున 84 టీ20ల్లో 107, 66 వన్డేల్లో 131, 31 టెస్టుల్లో 116 వికెట్లు పడగొట్టాడు.