Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 కౌంట్‌ డౌన్ స్టార్ట్: 'డబుల్ హౌస్'లో సామాన్యులు vs సెలబ్రిటీలు.. లీకైన కంటెస్టెంట్స్ లిస్ట్!

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ 9 కౌంట్‌ డౌన్ స్టార్ట్: 'డబుల్ హౌస్'లో సామాన్యులు vs సెలబ్రిటీలు.. లీకైన కంటెస్టెంట్స్ లిస్ట్!

బుల్లితెరపై బిగ్గెస్ట్ రియాలిటీ షో 'బిగ్ బాస్' . గత ఎనిమిది సీజన్ ల నుంచి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ షో ఈసారి సరికొత్త ఫార్మాట్ లో రాబోతోంది.  ఇప్పటికే 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ' షో కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 7న సాయంత్రం 7 గంటలకు గ్రాండ్‌గా, అనూహ్యమైన మలుపులతో ప్రారంభం కానుంది. ఈ షో స్టార్ మాలో ప్రసారం కానుంది. ఈసారి షోకు మరింత ఊపు తీసుకురావడానికి కింగ్ నాగార్జున హోస్ట్‌గా, డబుల్ హౌస్ అనే కొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు.

ఈ సీజన్ ప్రత్యేకత ఏమిటంటే, కేవలం సెలబ్రిటీలతో కాకుండా, సామాన్య ప్రజలకు కూడా అవకాశం కల్పించడం. దీనికోసం నిర్వహించిన 'అగ్ని పరీక్ష' అనే గేమ్ షో ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను అమాంతం పెంచింది. ఈ ప్రీ-షోలో పాల్గొన్న 45 మంది నుంచి మొదట 15 మందిని ఎంపిక చేసి, వారి నుంచి చివరిగా ఆరుగురు కామన్ కంటెస్టెంట్లను ఫైనల్ చేశారు. వీరు నేరుగా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టనున్నారు.

'మహా అగ్నిపరీక్ష'లో విజేతలు?
ఈ 'మహా అగ్నిపరీక్ష'లో విజేతలుగా నిలిచిన  కామన్ కంటెస్టెంట్ల లిస్ట్ లీక్ అయింది. బిగ్ బాస్ తెలుగు 9 హౌస్ లోకి అడ్డుపెట్టనున్న  ఆరుగురు కామన్ కంటెస్టెంట్లు వీరే అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. వారిలో   'అగ్ని పరీక్ష'లో ప్రతి టాస్క్‌ను తన తెలివితేటలతో గెలిచిన దమ్ము శ్రీజ పేరు వినిపిస్తోంది. ఆమె ఆత్మవిశ్వాసం, ఫైటింగ్ స్పిరిట్‌తో హౌస్‌లో బలమైన పోటీనిస్తుందని భావిస్తున్నారు. మరొకరు టాస్క్‌లలో తన విలక్షణమైన ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్న మాస్క్ మ్యాన్ హరీష్. తన అసలైన వ్యక్తిత్వాన్ని చూపించడంలో స్పష్టంగా ఉండటం వల్ల ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇక  సినిమాలపై ఉన్న ఆసక్తితో తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి సిద్ధమైన ఈ యువకుడు ఆర్మీ పవన్ కళ్యాణ్. అతని అంకితభావం కారణంగా సెలెక్ట్ అయ్యాడని సమాచారం.

►ALSO READ | RGV : మరోసారి వివాదంలో రామ్ గోపాల్ వర్మ.. దావూద్ ఇబ్రహీం నాకు గురువు అంటూ ట్వీట్!

 గేమ్ పట్ల ఆమెకున్న పట్టుదల, పోటీని గట్టిగా ఇస్తుందని భావించడంతో ప్రియ శెట్టి కూడా ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. ఇక టాస్క్‌లో గెలవడానికి ఏదైనా చేస్తాడు అనే లక్షణంతో, హౌస్‌లో ఒక ఆసక్తికరమైన ఆటగాడిగా మర్యాద మనీష్ అవకాశం ఉంది ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.  శారీరక ఫిట్‌నెస్, ఆటపై దృఢమైన అంకితభావంతో ఉన్న యువకుడు హీ మ్యాన్ పవన్ ను  చివరిగా ఎంపికైన కంటెస్టెంట్ ప్రచారం జరుగుతోంది.  అయితే వీరిలో ఆట తీరులో పాటు ఆడియన్స్ నుంచి ఎక్కువ ఓట్లు పొందిన వారు 'బిగ్ బాస్ 9'మెయిన్ హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీల లిస్ట్ ను  రేపు సాయంత్రం బిగ్ బాస్ యాజమాన్యం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది..

సెలబ్రిటీల లిస్ట్.. ఊహించని మలుపులు!
కామన్ మ్యాన్‌లతో పాటు, బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించనున్న సెలబ్రిటీల గురించి కూడా ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.  రీతూ చౌదరి, ఇమ్మాన్యుయేల్, దీపిక, దేబ్‌జాని, కావ్య, తేజస్విని, శివ కుమార్, కల్పిక గణేష్, సుమంత్ అశ్విన్, సాయి కిరణ్,  సాకేత్ వంటి పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి కొత్తగా వచ్చిన కామన్ కంటెస్టెంట్లకు సెలబ్రిటీల నుంచి తీవ్రమైన పోటీ ఎదురవుతుందని భావిస్తున్నారు. ఈ రెండు వర్గాల కలయిక, వారి మధ్య ఏర్పడే బంధాలు, విభేదాలు, భావోద్వేగాలు ఈ సీజన్‌ను మరింత రంజుగా మారుస్తాయని అభిమానులు భావిస్తున్నారు.

'డబుల్ హౌస్' - కొత్త నిబంధనలు!
ఈసారి బిగ్ బాస్ హౌస్‌కు మరొక ప్రత్యేక ఆకర్షణ 'డబుల్ హౌస్' కాన్సెప్ట్. రెండు వేర్వేరు ఇళ్లు, వాటికి సంబంధించిన ప్రత్యేక టాస్క్‌లు, కంటెస్టెంట్‌ల మధ్య కొత్త రకమైన డ్రామాకు దారితీస్తాయని అంచనా. జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉండటంతో, అభిమానుల ఆసక్తి తారస్థాయికి చేరింది. ఈసారి బిగ్ బాస్ ఎలాంటి డ్రామా, ఎమోషన్స్, హై వోల్టేజ్ ఎంటర్టైన్‌మెంట్‌ను అందించబోతున్నాడో చూడాలి.