SSMB29: సింహంతో మహేష్ బాబు పోరు.. లీకైన కెన్యా షూటింగ్ విజువల్స్! ( వీడియో )

SSMB29: సింహంతో మహేష్ బాబు పోరు.. లీకైన కెన్యా షూటింగ్ విజువల్స్! ( వీడియో )

భారతీయ సినీ ప్రపంచంలో అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న చిత్రం 'SSMB 29' . సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ గురించి రోజుకో కొత్త వార్త, ఊహించని అప్ డేట్ సినీ ప్రియులను ఆశ్యర్యపరుస్తోంది. ఈ సినిమా ప్రకటన చేసినప్పటి నుంచి ఏదో ఒక విషయంలో భారీ హైప్‌ను సృష్టిస్తూనే ఉంది. లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి  ఫోటులో , వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవి అభిమానుల ఉత్సాహాన్ని తారాస్థాయికి చేర్చాయి. 

 లీకైన మహేష్ ఫోటోలు వైరల్!
గత కొంతకాలంగా 'SSMB29' టీమ్ కెన్యాలోని అడవుల్లో, పర్వతాల మధ్య చిత్రీకరణ జరుపుకున్న సంగతి తెలిసిందే.  ఎండలో, కొండల మధ్య షూటింగ్ జరుగుతున్నట్లుగా కనిపిస్తున్న కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి.  ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఫోటోలలో మహేష్ బాబు లుక్ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. 

 

ముఖ్యంగాఒక సింహంతో కలిసి నడుస్తున్నట్లుగా ఉన్న ఫోటో, అలాగే వెనుక వైపు నుంచి మహేష్ బాబు చేతిలో గొడ్డలి పట్టుకున్న మరొక ఫోటో ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు "మహేష్ బాబుతో ఏదో గట్టి ప్లానే చేశారు రాజమౌళి.  ఈసారి ఆస్కార్ గ్యారెంటీ" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీడియోలు షేర్ చేస్తూ.. ఒక సింహంతో ఇంకో సింహం పోటీ ఎలా ఉంటుందో చూశారా..  అంటూ ఫ్యాన్స్ పోస్ట్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఇవి సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి.

నైరోబి నుండి హైదరాబాద్ కు మహేష్ బాబు
 "SSMB29'  కెన్యా షెడ్యూల్ పూర్తయింది. రాజమౌళి బృందం హైదరాబాద్ చేరుకుంది.  నైరోబి నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు తిరిగివచ్చారు. ఈ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కెమెరాకు చిక్కిన వీడియోను అభిమానులు షేర్ చేసుకుంటూ .. అభినందనలు తెలుపుతున్నారు. 

 

కెన్యా పర్యటనపై రాజమౌళి స్పందన
SSMB29 బృందం కెన్యా పర్యటన తర్వాత, ఆ దేశ కేబినెట్ కార్యదర్శి ముసాలియా ముదవాడి ఎక్స్ లో రాజమౌళితో కలిసి ఉన్న చిత్రాలను పోస్ట్ చేస్తూ, తమ దేశంలో చిత్రీకరణ జరిగినందుకు సంతోషం వ్యక్తం చేశారు. దీనికి రాజమౌళి రీ-షేర్ చేస్తూ, కెన్యా ప్రజలకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. "కెన్యాను సందర్శించడం నిజంగా ఒక అందమైన, జీవితకాలంలో ఒకసారి అనుభవం. అక్కడ చిత్రీకరణ నా కెరీర్‌లో మరపురాని క్షణాల్లో ఒకటి. కెన్యా ప్రభుత్వం, అలాగే మసాయి మారా, నైవాషా, సంబురు  అంబోసెలి స్థానికులకు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.

పాన్-వరల్డ్ లక్ష్యంతో..
ఈ 'SSMB29' పాన్ వరల్డ్ స్థాయిలో ఏకంగా 120కి పైగా దేశాల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి.  ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునేలా అడ్వెంచర్, యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా కథాంశం ఒక వేటగాడి ప్రయాణం నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఈ భారీ ప్రాజెక్టులో మహేష్ బాబుతో పాటు, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి అంతర్జాతీయ తారాగణం కూడా భాగం కానున్నారు.. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఫేస్ కనిపించకుండా విడుదల చేసిన ఒక పోస్టర్ కూడా ఈ సినిమాపై ఉత్కంఠను పెంచింది.  నవంబర్‌లో 'SSMB29'కి సంబంధించిన పూర్తి అప్‌డేట్ ఇస్తానని రాజమౌళి తెలియజేశారు. ఈ చిత్రం ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.

►ALSO READ | Ghaati Box Office : అనుష్క పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్.. 'ఘాటీ' తొలిరోజు ఎన్ని కోట్లు వసూలు చేసిందంటే?