కొత్త మిస్సైల్స్​ వచ్చేస్తున్నాయ్​: ఇండియాలో బటన్ నొక్కితే.. చైనా మాటాష్

కొత్త మిస్సైల్స్​ వచ్చేస్తున్నాయ్​: ఇండియాలో బటన్ నొక్కితే.. చైనా మాటాష్

భారతదేశం తన అణ్వాయుధ సామర్థ్యాలు విస్తరించేందుకు, కొత్త న్యూక్లియర్​ డెలివరీ సిస్టమ్​లను అభివృద్ధి చేస్తున్నట్లు స్వీడన్​కు చెందిన థింక్​– ట్యాంక్​ సిప్రి వెల్లడించింది. థింక్​ ట్యాంక్​ స్టాక్​ హోమ్​ ఇంటర్నేషనల్​ పీస్​రిసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ నివేదిక ప్రకారం.. సుదూర లక్ష్యాలు టార్గెట్​ చేసే ఆయుధాలు డెవలప్​ చేయడానికి భారత్​ కసరత్తు చేస్తోంది. పొరుగున ఉన్న పాకిస్థాన్​, చైనా నుంచి పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు వల్ల ఇండియా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. భారత్​తో పాటు పాకిస్థాన్​కూడా తమ అణ్వాయుధాలు విస్తరించడం, అణు డెలివరీ సిస్టమ్ లు అభివృద్ధి చేస్తోంది.

చైనా అంతటా లక్ష్యాలను ఈజీగా చేరుకునే సామర్థ్యంతో కూడిన వెపన్స్​ తయారు చేయడానికి భారత్​ ప్రాధాన్యం ఇస్తోందని సిప్రీ ఇయర్​ బుక్​ 2023లో పేర్కొంది. ఇండో పసిఫిక్​ సముద్రంలో మారుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, చైనా బల ప్రదర్శన, సైనిక ఆధునికీకరణ ఈ పరిస్థితులను గమనించి భారత్​ అప్రమత్తమైంది. సుదూర శ్రేణి అణ్వాయుధాలపై దృష్టి సారించడం, చైనాకు వ్యతిరేకంగా తన సామర్థ్యాలను పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అధునాతన టెక్నాలజీని ఉపయోగించుకుంటోంది. 5,000 కి.మీ. లక్ష్యాన్ని ఛేదించే అగ్ని – వీ వంటి శ్రేణి బాలిస్టిక్​ క్షిపణులకు రక్షణ మంత్రిత్వ శాఖ మరిన్ని మెరుగులు దిద్దుతోంది. 

చైనాలో పెరిగిన వెపన్స్​..

సిప్రీ నివేదిక అంచనా ప్రకారం.. 2022 జనవరిలో చైనా అణు ఆయుధాలు 2022లో 350 వార్​హెడ్​ల నుంచి 2023 జనవరి నాటికి 410కి పెరిగాయి. ప్రస్తుతం ఇండియాలో 164 అణు వార్​హెడ్​లు ఉన్నాయి.