
అతనో ప్రముఖ బ్యాంక్ ఉన్నత స్థాయి ఉద్యోగి. ఆషామాషి ఉద్యోగం కాదండోయ్ మూడుదేశాలకు చెందిన బ్యాంక్ లావాదేవీలకు ఈయనే హెడ్. అంత అత్యున్నత స్థానంలో ఉన్న ఆ ఉద్యోగి ఏం చేశాడో తెలుసా..? బర్గర్ పైసలు మిగిలుతాయని అనుకున్నాడో ఏమో..ఆ బ్యాంక్ ప్రధాన కార్యాలయం క్యాంటీన్ లో బర్గర్ దొంగతనం చేయడం మొదలుపెట్టాడు. ఆ దొంగతనమే కొంపముంచింది. సంవత్సరానికి కోట్లు సంపాదించుకునే ఉద్యోగం నుంచి సస్పెండై లబోదిబోమంటున్నాడు.
యూరప్‌లో సిటీ గ్రూప్ బ్యాంక్‌లో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్న పరాశ్ యూరప్‌తోపాటు మధ్యప్రాచ్యం, ఆఫ్రికా బ్యాంకింగ్ కార్యకలాపాలకు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. అంత ఉన్నత స్థానంలో ఉన్న పరాశ్ శాండ్‌విచ్ డబ్బుల కోసం కక్కుర్తి పడి దొంగతనం చేయడం మొదలు పెట్టాడు. కానరీ వార్ఫ్‌లో ఉన్న బ్యాంక్ ప్రధాన కార్యాలయం నుంచి తరచుగా ఆహారాన్ని దొంగలిస్తున్నారట. పలుసార్లు శాండ్‌విచ్‌లు దొంగలించారట. ఆ విషయం ఎప్పుడు వెలుగులోకి వచ్చిందో ఏమో బ్యాంక్ యాజమాన్యం అతన్ని విధుల నుంచి సస్పెండ్ చేసింది.
సంవత్సరానికి 9కోట్ల జీతం తీసుకుంటున్న పరాశ్ దొంగతనం చేయడం ఏంటని బ్యాంక్ కిందిస్థాయి ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.