జనగణమన, వందేమాతరానికి సమాన గౌరవం ఇవ్వాలి : కేంద్రం

జనగణమన, వందేమాతరానికి సమాన గౌరవం ఇవ్వాలి : కేంద్రం

జాతీయగీతం జనగణమనకు.. వందేమాతరం గేయానికి సమాన హోదా ఉందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. జనగణమనకు సమానమైన హోదాను వందేమాతరం గేయానికి కూడా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విధంగా స్పందించింది. దేశంలోని ప్రతి పౌరుడు ఈ రెండింటికి సమాన గౌరవం ఇవ్వాలని స్పష్టం చేసింది. 

జనగణమనకి, వందేమాతరానికి సమాన గౌరవం కల్పించే విధంగా మార్గదర్శకాలను రూపొందించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టులో కొద్దిరోజుల క్రితం పిల్ దాఖలైంది. స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం కీలక పాత్ర పోషించిందని కోర్టు దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో వందేమాతరానికి కూడా జనగణమనతో సమానమైన గౌరవం ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీంతో రెండింటికి సమాన హోదా ఉంటుందని కేంద్రం కోర్టుకు తెలిపింది.