మాన్విస్ స్టూడియో
‘బయో స్టెర్ల్ ఎయిర్’
కాస్ట్ రూ.11 వేల నుంచి రూ.70 వేల మధ్యలో
హైటెక్స్‌లో ప్రారంభమైన పీహెచ్‌ఐసీ ఎక్స్‌పో
హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్‌తో పాటు అన్ని రకాల బ్యాక్టీరియాలు, వైరస్‌లు, ఫంగస్‌ల నుంచి మన ఇంటిని, ఆఫీసులను సురక్షితంగా ఉంచే నానో సుప్రీమ్ బయో స్టెరిలైజర్ ప్రొడక్ట్‌ను మాన్విస్ స్టూడియో(హెల్త్ బొటిక్) గురువారం పీహెచ్‌ఐసీ ఎక్స్‌పో 2020 లో ప్రదర్శించింది. ప్రముఖ రీసెర్చర్ డాక్టర్ ఏవీ రావు, మాన్విస్ స్టూడియో సహకారంతో ఈ ప్రొడక్ట్‌ను ఇన్వెంట్ చేశారు. ఈ మెషిన్ పేరు ‘బయో స్టెర్ల్ ఎయిర్’గా కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్(సీఓఓ) సంకీర్త్ సుభాష్ తెలిపారు. ఇది ప్లగ్ అండ్ ప్లే మెషిన్ అని, ఎలాంటి కెమికల్స్, స్మోక్ ఉండదని చెప్పారు. ఈ మెషిన్‌ను ఒక్కసారి ఆన్ చేస్తే రూమ్ మొత్తాన్ని అన్ని వైరస్‌ల నుంచి డిజిన్‌ఫెక్ట్ చేస్తుందని వివరించారు. మరో వారం, పది రోజుల్లో దీన్ని లాంచ్ చేస్తామని కంపెనీ సీఏఓ కే జగ్‌దీశ్ ప్రకటించారు. పదేళ్ల రీసెర్చ్ అనంతరం ఈ ప్రొడక్ట్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మల్లాపూర్‌లో కంపెనీకి ఆర్ అండ్ డీ ఫెసిలిటీ ఉంది. తమకు యూఎస్‌ఎఫ్‌డీఏ రిజిస్ట్రేషన్ ఉందని వెల్లడించారు. ఈ ప్రొడక్ట్ ‘మేడిన్ ఇండియా’ ‘మేడిన్ తెలంగాణ’ ప్రొడక్ట్‌గా అభివర్ణించారు. తొలుత హైదరాబాద్‌లో లాంచ్ చేసి ఆ తర్వాత ఏపీలో లాంచ్ చేస్తామన్నారు. దీని ధర రూ.11 వేల నుంచి రూ.70 వేల మధ్యలో ఉంది. 200 చదరపు అడుగుల నుంచి 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల రూమ్ సైజులకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా ఆఫీసులు, థియేటర్లు, హోటల్స్‌కు బాగా ఉపయోగకరంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. అన్ని ఈకామర్స్ ప్లాట్‌ఫామ్‌లు, డిస్ట్రిబ్యూటర్లు, రిటైల్ షాపులలో ఈ మెషిన్‌ను అందుబాటులోకి తెస్తామని, డైరెక్ట్‌గా కూడా ఆర్డర్లు తీసుకుంటామన్నారు.
పెద్ద హాల్స్‌ను 15 నిమిషాల్లో డిజిన్‌ఫెక్ట్…
బెంగళూరుకు చెందిన జనరల్ మార్కెటింగ్ కార్పొరేషన్ కూడా తన ఇన్నొవేటివ్ ప్రొడక్ట్‌లను లాంచ్ చేసింది. 15 నిమిషాల్లో 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న హాల్స్‌ను డిజిన్‌ఫెక్ట్, ప్యూరిఫై చేసే 100 శాతం హెర్బల్ విరోనిల్–బీజీఆర్ 50 మెషిన్‌ను లాంచ్ చేసింది. అంతేకాక ఎలాంటి వైరస్ మన బాడీలోకి చేరకుండా ఉండేందుకు కొన్ని ప్రొడక్ట్‌లను ఆఫర్ చేస్తున్నామని కంపెనీ ఫౌండర్ శిరీష్ తెలిపారు. ఆల్కహాల్, కెమికల్స్ లేకుండా కేవలం హెర్బల్ ప్రొడక్ట్‌లనే ఈ కంపెనీ తీసుకొచ్చింది. అలోవీరాతో తాము శానిటైజర్‌ను రూపొందించామని, ఇది మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగపడుతుందన్నారు. మురుగు నీటిని ప్యూరిఫై చేసే మిషన్, ఆల్కలైన్ వాటర్, మస్కిటో రిపిలెంట్, అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, డయాబెటిక్ ఫుడ్ ప్రొడక్ట్స్, లేక్స్ అండ్ పాండ్స్ క్లీనింగ్ చేసే ప్రొడక్ట్‌లు, డిజిన్‌ఫెక్షన్ శానిటైజర్ స్ప్రై, కర్కుమిన్(పసుపు) ప్రొడక్ట్‌లు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, మీట్ వాష్ ప్రొడక్ట్‌లను ఈ కంపెనీ ఎక్స్‌పోలో ప్రదర్శించింది. తమ అన్ని ప్రొడక్ట్‌ల్లో డయాబెటిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ బెంగళూరులో ఎక్కువగా అమ్ముడుపోతున్నాయన్నారు. 2 కేజీల రైస్, 2 కేజీల గోధుమ, 1 కేజీ షుగర్‌ను డయాబెటిక్ ఫుడ్ కిట్‌లో ఇస్తున్నామని ఇది వాడిన 2 నుంచి 3 నెలల్లోనే షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయన్నారు.
చాలా ఇన్నొవేటివ్ ప్రొడక్ట్‌లు…
హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో గురువారం నుంచి ప్రారంభమైన ప్రివెన్టివ్ హెల్త్‌కేర్ అండ్ ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ ఎక్స్‌పో(పీహెచ్‌ఐసీ ఎక్స్‌పో )2020లో పలు లీడింగ్ కంపెనీలు తమ ప్రొడక్ట్‌లను ప్రదర్శిస్తున్నాయి. హాస్పిటల్స్, లైఫ్ సైన్సెస్ ల్యాబోరేటరీస్, ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్ సెంటర్స్, ఆఫీసు స్పేస్‌లు, అతిపెద్ద కమర్షియల్ ఫెసిలిటీస్, స్కూల్స్, కాలేజీలు, హోటల్స్, రెస్టారెంట్లు, కో వర్కింగ్ స్పేస్‌లలో సేఫ్ ఎన్విరాన్‌మెంట్‌ను అందించే కంపెనీలు పలు ఇన్నొవేటివ్ ప్రొడక్ట్‌లను, సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి.ఈ ఎక్స్‌పో 50కి పైగా స్టాల్స్ ఉన్నాయి. కరోనాకు బెస్ట్ వ్యాక్సిన్ మాస్క్ పెట్టుకోవడం, రెగ్యులర్‌గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఫిజికల్ డిస్టాన్స్ పాటించడమేనని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ సెక్రటరీ సంజీవ్ సింగ్ యాదవ్ అన్నారు. శానిటైజర్లు ఎక్కువ వాడకంపై ప్రజలను హెచ్చరించారు. ఇది కొన్ని సార్లు సెన్సిటివిటీని దెబ్బతీస్తుందన్నారు.
సిట్రోబయోషీల్డ్ లాంచ్…
కరోనా ప్రివెన్షన్ కోసం నేచురల్ అండ్ ఆర్గానిక్ యాంటీ మైక్రోబియల్ సిట్రోబయోషీల్డ్‌ను జెర్మ్‌కిల్ ఇండియా ల్యాబ్స్ లాంచ్ చేసింది. కరోనా వైరస్‌తో పాటు అన్ని రకాల వైరస్‌లను ఇది డిస్‌ఇన్‌ఫెక్ట్ చేస్తుంది. నాన్ టాక్సిక్, నాన్ ఆల్కహాల్, నాన్ అలర్జిక్, ఇకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్ అని కంపెనీ చెప్పింది. పిల్లలు కూడా దీన్ని సేఫ్‌గా వాడొచ్చని జెర్మ్‌కిల్ చెప్పింది.
