- సీఐటీయూ ఆల్ ఇండియా సెక్రటరీ సుదీప్ దత్తా
గోదావరిఖని, వెలుగు: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక, కార్మిక చట్టాలను మార్చుతూ ప్రభుత్వ రంగ సంస్థల నిర్వీర్యానికి కుట్ర చేస్తోందని సీఐటీయూ ఆల్ఇండియా సెక్రటరీ సుదీప్ దత్తా ఆరోపించారు. ఆదివారం గోదావరిఖనిలోని సింగరేణి ఆర్‌సీవోఏ క్లబ్ఆడిటోరియంలో సింగరేణి కాలరీస్ఎంప్లాయిస్యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో యువ కార్మికుల సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు హాజరైన సుదీప్దత్తా మాట్లాడుతూ కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలతో భవిష్యత్‌లో పెట్టుబడిదారుల చేతుల్లోనే పరిశ్రమలు ఉంటాయన్నారు. కార్మిక సంఘాల్లో యువ కార్మికుల భాగస్వామ్యం పెరిగితేనే హక్కులు కాపాడుకోగలుగుతారన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య, భూపాల్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి, కార్యదర్శి నరసింహరావు, ఎస్.నాగరాజు, గోపాల్, రాజమౌళి, శ్రీనివాస్, తదితరులు
పాల్గొన్నారు.
