టోల్ ప్లాజా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

టోల్ ప్లాజా కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

నేరడిగొండ, వెలుగు: టోల్ ప్లాజాలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. నేరడిగొండ మండలంలోని రోల్ మామడ టోల్ ప్లాజా కాంప్లెక్స్ లో ఆదివారం టోల్ ప్లాజా యూనియన్ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నమొల్ల కిరణ్ మాట్లాడుతూ.. టోల్ ప్లాజాల్లో పనిచేస్తున్న సిబ్బందిని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  దర్శనాల మల్లేశ్, లక్ష్మణ్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు.