సింగరేణి ఎన్నికల్లో గెలిచిన సంఘాలకు సర్టిఫికెట్లు ఇవ్వాలి

సింగరేణి ఎన్నికల్లో గెలిచిన సంఘాలకు సర్టిఫికెట్లు ఇవ్వాలి
  •     సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు టి.రాజారెడ్డి డిమాండ్​

గోదావరిఖని, వెలుగు :  సింగరేణి ఎన్నికల్లో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలుగా గెలిచిన యూనియన్లకు యాజమాన్యం తక్షణమే సర్టిఫికెట్లను అందజేయాలని, లేదంటే సమస్యలపై చర్చించేందుకు అన్ని కార్మిక సంఘాలకు సమాన ప్రాధాన్యం కల్పించాలని సీఐటీయూ అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా ఉన్న పదవీ కాలాన్ని నాలుగు సంవత్సరాలకు పెంచుకోవాలనే ఏఐటీయూసీ

ఐఎన్​టీయూసీ కుట్రలో భాగంగానే యాజమాన్యం సర్టిఫికెట్లు అందజేయడంలో జాప్యం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సింగరేణిలో రాజకీయ జోక్యం మరింతగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.   కార్మిక సమస్యల పరిష్కారం కోసం మార్చి 1న సాయంత్రం నాలుగు గంటలకు ఆర్జీ వన్ జీఎం ఆఫీస్​ ముందు ధర్నా నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా లీడర్లు ధర్నా పోస్టర్​ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లీడర్లు ఆరెపల్లి రాజమౌళి, రవీందర్ రెడ్డి, దాసరి సురేష్, విజయ్ కుమార్, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.