రైతు దగ్గరికే రైతు సినిమా

రైతు దగ్గరికే రైతు సినిమా

‘వాటర్‌ మ్యాన్‌ ’ అనే ఒక కామెడీ డాక్యుమెంటరీ ఇయ్యాల అమెరికాలో దుమ్ము రేపుతోంది. అవార్డుల మీద అవార్డులు ఈ సినిమాకు. నవ్విస్తూనే ఒక సీరియస్‌ ఇష్యూని చెప్తది ఈ సినిమా. హైదరాబాద్ చెం దిన 28 ఏళ్ల అన్షుల్‌ సిన్హా దీనికి డైరెక్టర్‌ . ఇదొక్కటే కాదు,అన్షుల్‌ సిన్హా దీనికి బాబు లాంటి సినిమాలే తీసిండు. రైతుల కోసం ఒక సినిమా తీస్తే అది థియేటర్లకు రాలేదు. రిలీజ్‌ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ‘ఈ సినిమాలు  ఏంఆడుతయ్!’ అని ఎక్కిరించిన్రు. ‘మీరేంది రిలీజ్‌ చేసేది!’ అని  ఊరూరూ తిరిగి రైతులకు తనే సినిమా చూపించిం డు. ఈ సినిమా చూసి ఆ రైతులు చప్పట్లు కొట్టలేదంట. ఏడ్చి, ‘ఇది ముందే వచ్చుంటే మా తోటి రైతులు ఆత్మహత్య చేసుకునేటోళ్లు కాదుగా!’ అన్నరంట. ఈ సినిమా కథలు ఏం చెప్తున్నయో అన్షుల్ సిన్హా నే అడిగి చూద్దాం.

మల్టీప్లెక్స్‌ థియేటర్ల  హవా నడుస్తున్న కాలంలో  కాలం చెల్లిన టూరింగ్‌ టాకీస్‌ ని మళ్లీ  పల్లెలకు తీసుకుపోయారు. రైతన్నా నీ కష్టానికి కారణాలివని చెప్పే ‘మిట్టి’ సినిమాని రైతుకు చూపించారు. డిజిటల్‌ స్క్రీన్‌ పై తమ జీవితాలను చూసుకున్న రైతులను కన్నీరు పెట్టించిందీ సినిమా. మాకు అన్నం పెట్టే రైతు కష్టాన్ని మేమూ వింటామని థియేటర్లు వెలివేసిన సినిమాని నగరాల్లోని గేటెడ్‌ కమ్యూనిటీలు ఘన స్వాగతం పలికాయి. పల్లెనుంచి అమెరికాలోని 26 నగరాల్లో, పోర్ట్‌‌‌‌ ల్యాడ్‌ (జర్మనీ), గ్రీస్‌ నగరాల్లో వీధుల్లో  ప్రదర్శించి భారత దేశంలో రైతు కన్నీళ్లను ఈ ప్రపంచానికి చూపించారు. కన్నీటి కథకు, టూరింగ్‌ టాకీస్‌ కు సారథి అన్షు ల్‌ సిన్హా .

వాట్‌ ఏ.. ‘వాటర్‌ మ్యాన్‌ ’

నీటి కష్టాలు మనకు కొత్త కాదు. రోజుకో రీతిలో ఎదురయ్యే నీటి కష్టాలకు అలవాటు పడిపోయాం. ఈ నీటి బాధలేవీ ఈతిబాధలని అనుకోనంతగా  అలవాటయ్యాం. మన సమస్యలతో సమాజానికి చురకలేసేలా రూపొందించిన ‘వాటర్‌ మ్యాన్‌ ’ నవ్వులు పండిస్తోంది . ఆ నవ్వుల ఖజానా మరోనజరానా సాధించింది . అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో వారం రోజుల క్రితం నిర్వహించిన ‘ఇకో కామెడీ వీడియో కాంపిటీషన్‌ –2019’లో విమర్శకుల ప్రశంసలందుకుని సెకండ్‌ బెస్ట్‌‌‌‌ డాక్యుమెంటరీ అవార్డ్‌ అందుకుంది . ఇదే డాక్యుమెంటరీ బెల్‌గ్రేడ్‌ లో జరిగిన‘ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ కల్చర్‌ఫెస్టివల్‌ ’లో మూడవ ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డు గెలుచుకుంది . క్రొయేషియా లో జూన్‌ లో నిర్వహించే ‘స్మరగ్దిని ఇకో ఫిల్మ్‌‌‌‌ ఫెస్టివల్‌ ’కు, హంగేరీలో నిర్వహించే‘ఇంటర్నేషనల్‌  నేచర్‌ ఫిల్మ్‌‌‌‌ ఫెస్టివల్‌ ’లో ప్రదర్శనకు ఎంపికైంది . 28 ఏళ్ల అన్షుల్‌ విజయాలను లెక్కించాలంటే  పెద్ద చిట్టారాయాల్సిందే. 41 డాక్యుమెంటరీలు, షార్ట్‌‌‌‌ ఫిల్మ్స్‌ , ఫీచర్‌ ఫిల్మ్స్‌ రూపొందించాడు. ఇవి 137 అవార్డులు గెలుచుకున్నా యి.

నాకు సామాజికాంశాలంటే ఆసక్తి ఎక్కువ. సామాజిక  ప్రయోజనం ఉన్నవిషయాలను నలుగురికి చెప్పడం నా బాధ్యత అనుకుంటాను. అలా మా అపార్ట్‌ మెంట్‌ లోఉండే నలుగురు పిల్లలతో నాలుగు నిమిషాల‘చాక్లెట్‌ ’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ తీశాను.  పెద్దల నుంచి పిల్లలు నేర్చుకుంటారు. పెద్ద వాళ్లు ఏం చేస్తే అదే పిల్లలు చేస్తుంటారు. కానీ పెద్ద వాళ్లు చేసే తప్పుల వల్ల తరువాతి తరం కూడా తప్పుదారిలో నడుస్తుంది.అది చాలా ప్రమాదం. ఈ విషయాన్నిచాలా తేలిగ్గా , అందరికీ అర్థమయ్యేలా ఈషార్ట్‌ ఫిల్మ్‌ లో చెప్పాను. దానికి లెక్కలేనన్ని ప్రశంసలొచ్చాయి. అది నా తొలి షార్ట్‌ ఫిల్మ్‌ .లయోలా కాలేజ్‌ (హైదరాబాద్‌ )లో జరిగిన‘ఇన్‌ ఫోకస్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌’కు పంపాను.బెస్ట్ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డు వచ్చింది. నేషనల్‌‌‌‌‌‌‌‌, ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లో దానిని ప్రదర్శించారు. ఈ షార్ట్‌ ఫిల్మ్‌ ఒక్కటే  21అవార్డులు గెలుచుకుంది. చిన్న సెల్‌‌‌‌‌‌‌‌ ఫోన్‌ కెమెరాతో, ఎనిమిది వందల రూపాయల ఖర్చుతో తీసిన షార్ట్‌ ఫిల్మ్‌ ఎంతో మందికికనెక్ట్‌ అయింది. ఈ విజయం నాకు కొండంతబలాన్నిచ్చిం ది.

సెకండ్‌ సక్సెస్‌ .. ‘లాపెట్’

పతంగులు ఎగరేయడంలో పిల్లలుకు ఉండే సంతోషమే వేరు. ఆ సంతోషాన్నిఆవిష్కరించిన షార్ట్‌ పిల్మ్‌ ‘లాపెట్‌ ’. ఒక పిలగాడు పతంగులాడేందుకు వాడే చరకా(లాపెట్‌ )లను సేకరిస్తుంటాడు. లాస్‌ఏంజెల్స్‌ లో జరిగిన అంతర్జా తీయ ఫిల్మ్‌ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌-–2013లో ఈ బాలుడి కథ బెస్ట్‌ షార్ట్‌ఫిల్మ్‌ అవార్డు గెలుచుకుంది. ఇదే నాకు తొలి అంతర్జాతీయ అవార్డు. ఈ విజయంతో ఏదైనా చేయగలననే అనుకున్నా ను. సామాజికాంశాలే నాకు ఆసక్తి. సామాజిక అంశాలతో సినిమాతీస్తే ఎక్కువ మందికి మనం చెప్పే విషయాలు చేరతాయని అనుకుంటున్నప్పుడే ‘రోడో స్పెరో’అనే సినిమాకు దర్శకత్వం చేసే అవకాశంవచ్చింది.

జర్నలిజం ఫ్యామిలీ

జర్నలిజం నేపథ్యం ఉన్నకుటుంబం మాది. మా తాత మునీంద్ర సిన్హా ‘దక్షిణ్‌ సమాచార్‌‌‌‌‌‌‌‌’అనే హిందీ వార పత్రికను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచే ఇది వెలువడుతోంది. నలభై ఏళ్లుగా ఈ పత్రిక వస్తుంది. మా బాబాయి దానిని నిర్వహిస్తున్నా రు. కుటుంబ ప్రభావంతో మాస్‌ కమ్యూనికేషన్‌ మాస్టర్‌‌‌‌‌‌‌‌ డిగ్రీలో చేరిన. ఈ కోర్సు లో డాక్యుమెంటరీ ప్రాజెక్టులు చేయించారు. దాని కోసం రెండు,మూడు నిమిషాల నిడివితో పది డాక్యుమెంటరీలు తీశాను.అలా మొదలైంది డాక్యుమెంటరీ హాబీ! పీజీ పూర్తి కాగా నే ఓ టీవీచానెల్‌‌‌‌‌‌‌‌లో చేరాను. దాని కోసం చేసిన డాక్యుమెంటరీలకు మంచి స్పందన వచ్చింది. అవార్డులు కూడా వచ్చాయి.

జర్నలిస్ట్‌ గా పనిచేస్తూ చేయడం కంటే ఫుల్‌‌‌‌‌‌‌‌ టైమ్‌ దీనిపైనే చేయాలని ఉద్యోగం మానేశా. రోడో స్పెరో తర్వా త 2015లో‘ఫీచర్‌‌‌‌‌‌‌‌ గేట్‌ వే టు హెవెన్‌ ’ అనే షార్ట్‌  ఫీచర్‌‌‌‌‌‌‌‌ తీశాను. ఇది అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించే వ్యక్తి కథ. ఈ షార్ట్‌ఫిల్మ్‌ 11 అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ కి నామినేట్‌ అయింది. ఆరు అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఈ మానవీయ కథనాన్ని స్పానిష్‌ భాషలోకి అనుదించారు.ప్రతిష్టాత్మకమైన యూకే ఫిల్మ్‌ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌లోమూడవ ఉత్తమ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డు వచ్చింది.మంచి పేరొచ్చింది. కానీ వాటితో సంపాదన లేదు. నేను చెప్పా లనుకున్నది ఈ సినిమాల ద్వా రా చెప్పా ను. అది జనానికి చేరింది. అదే మా విజయం.

3 రాష్ట్రాలు.. ముగ్గురు హీరోలు

ఓసారి జీవీ రామాంజనేయులు అనే సామాజిక కార్యకర్త పరిచయం అయ్యాడు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగంలో సంక్షోభం గురించి ఆయన నాకు చాలా బాగా చెప్పాడు.మనకు ఎన్నో సేవలందించే వాళ్లుంటారు.వాళ్లందరి సమస్యల గురించి ఆలోచిస్తున్నాం.కానీ  అందరికీ అన్నం పెట్టే రైతుల గురించిఎందుకు ఆలోచించలేకపోయానే అనిపించింది. నేను పుట్టి, పెరిగింది నగరాల్లో. వ్యవసాయం గురించి పెద్దగా తెలియదు. కానీఈ దేశంలో రైతుల చావుల గురించి ఎన్నోవార్తలు చదివాను. వాళ్ల కోసం నేనేమైనా చేయగలనా అనుకున్నప్పుడు.. సినిమానే మనసుకు తట్టిం ది. రైతుల కోసం ఇంట్లో కూర్చుని కథ రాసుకుంటే తప్పు. వార్తలు,వీడియోలు చూసి కథ రాసుకోవడం కాదు…రైతుల బతుకులు చూసి రాసుకోవాలనుకున్న. రైతు స్వరాజ్య వేదిక వాళ్లని కలిసి వ్యవసాయ సంక్షోభం తీవ్రంగా ఉన్న ఊళ్లు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల గురించి ఆరా తీశాను. వాళ్ల సహకారంతో నల్లగొండ జిల్లాలోని కరువు పల్లెలు తిరిగాను. ఆ తర్వా తదేశంలో తీవ్రమైన కరువుతో బాధపడుతున్నవిదర్భ (మహారాష్ట్ర) ప్రాంతంలోని పల్లెల్లో తిరిగాం. అధిక దిగుబడి వచ్చే  లుథియానా(పంజాబ్‌ ) ప్రాంత రైతుల్ని కలిశాం.

రైతు జీవితాన్ని చదవాలని పల్లెల్లోఏడాదిన్నర కష్టపడ్డాను. పరిశోధనాత్మకమైన డాక్యుమెంటరీలు తీయడం నాకు అలవాటు. అదే తరహాలో మొదటి స్క్రిప్టు సిద్ధం చేసుకున్నాను. మన దేశంలో రైతు ఆత్మహత్యలకు పర్యావరణ ఆర్థిక, సామాజిక కారణాలు రైతుల మరణానికి కారణంఅవుతున్నాయి. ఈ విషయాలు సామాన్యులకు అర్థం కావాలంటే ఒక డ్రామా ఉండాలి. ఆ డ్రామా కోసం నా పరిశోధన నుంచి తీసుకున్నఅంశాలను రంగస్థల నటుడు రజనీష్‌ కిఇచ్చాను. ఆయన మంచి రచయిత కూడా. తనతోనే మాటలు కూడా రాయించాను. క్రౌడ్‌ఫండింగ్‌ తో సినిమా నిర్మాణం పట్టాలెక్కింది. మొత్తానికి రెండు సంవత్సరాలకు సినిమా నిర్మాణం పూర్తయింది. ‘మిట్టి’ సినిమా ‘బ్యాక్‌‌‌‌‌‌‌‌ టు ద రూట్‌ ’ ట్యాగ్‌ తో ప్రదర్శనకు సిద్ధమైంది.కానీ బయ్యర్లు లేరు.

మార్కెట్‌ ‘అమ్మబోతే అడవి.. కొనబోతే కొరవి’. రైతులాగే మనమూ దగా పడుతాం. ఈకొరివితో తలగోక్కోవడం మనకెందుకని చాలా మంది దర్శకులు, నిర్మాతలు సామాజిక చిత్రాల జోలికి పోరు. ఇక గ్రామీణ నేపథ్యంలో రైతు సమస్యలపై కమర్షియల్‌ గా హిట్‌ కాదుకదా బయ్యరు కూడా దొరకడు. అందుకే అందరూ వెనుకడుగు వేస్తారు. పదికి పైగా సంస్థల విరాళం, వంద మంది ఉద్యోగులు, వ్యాపారుల ఆర్థిక సహకారంతో తెరకెక్కిన ‘మిట్టి’ సినిమాకు లాభం రాకున్నా రైతుకు చేరితే చాలనుకున్నారు. కానీ ఈ సినిమా ఒక్క థియేటర్‌ గడప తొక్కలేదు. ఏ ఒక్క ప్రేక్షకుడికీ చేరువ కాలేదు. కల్లం నిండా గింజలున్నాకంచంలో మెతుకుల్లేని రైతు బతుకు లాగే అయింది ఈ సినిమా. వరద పాలైన పంటలా కష్టమంతా సీడీల్లో ఉండిపోయింది. ‘నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా?’ దేశానికి అన్నం పెట్టే రైతు కన్నీళ్లను దోసిళ్ల కెత్తిన కథను భుజానికెత్తుకున్నారు.

విలేజ్‌ ‘షో’

ఇది కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ఎలిమెంట్‌ లేని సినిమా. డిస్ట్రిబ్యూటర్లు దొరకలేదు. థియేటర్‌‌‌‌‌‌‌‌లో ప్రదర్శనకు అవకాశం రాలేదు. సినిమాకు జనం రాలేదు. కాబట్టి జనం దగ్గరకే సినిమాని తీసుకు పోవాలనుకున్నాం. డిజిటల్‌‌‌‌‌‌‌‌ స్క్రీన్‌ ,సౌండ్‌ సిస్టమ్‌ ఉండే ప్రచార వాహనాలు కమర్షియల్‌‌‌‌‌‌‌‌ ప్రమోషన్లు చేస్తుంటాయి.వాటిని ఊరూరూ తిప్పుతూ సినిమాని రైతులకు చూపించడం మొదలుపెట్టాం. హిందీ సినిమా అయినా రైతులకు భాషా సమస్య ఎదురుకాలేదు. జీవితాలను చూపించే సినిమా ఇది. మూడు ప్రాంతాల్లోవ్యవసాయ సంక్షోభాన్ని అధ్యయనం చేశాం. రైతుల ఆత్మహత్యలకు ప్రధానమైనవి మూడు (ఆర్థిక, సామాజిక, పర్యావరణ)కారణాలని తేల్చాం. దానికి తగ్గట్టే ఈకథలో ముగ్గురు రైతులు ప్రధాన పాత్రలుగా సినిమాని తెరకెక్కించాం. ఎక్కువగా పురుగుమందులు వాడి ఓ రైతు గొంతు క్యా న్సర్‌‌‌‌‌‌‌‌తో చనిపోతాడు. అధిక పెట్టుబడి, అప్పులు,వడ్డీల కారణంగా ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకుం టాడు. తాగుబోతుగా మారిన మరోరైతు చనిపోతాడు. నేల సారం కోల్పోయి, పర్యావరణ మార్పులతో రైతు బిడ్డల జీవితం ఎంత దయనీయంగా మారిందో మా సినిమా చెబుతుంది. సినిమా చూస్తూ చాలా మంది రైతులు ఏడ్చారు. ఇలాంటి సమస్యలతోనే మా బిడ్డలు చచ్చిపోయారని తల్లులు చెప్పడం విన్నాం.

రైతులు కష్టాలకు కారణాలే కాదు ప్రత్యామ్నాయాలూ ఉన్న ఈ సినిమాని చూసి పల్లెలు చప్పట్లు కొట్టలేదు. ఈ సినిమా ఇంకా ముందే వస్తే ఎన్నో చావులు ఆగేవి కదా అని కన్నీరు పెట్టినయ్‌ . తెలంగాణ, విదర్భ, లుథియానా రోడ్‌ షోలలో ఈ సినిమాని ప్రదర్శించాం. ఇప్పటి వరకు 175 షోలు చేశాం. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లో రోడ్‌షోలలో ప్రదర్శించారు. జర్మనీలో రెండు చోట్ల ప్రదర్శించారు. ఈ సినిమా చూసి కొంతమంది డబ్బులు విరాళాలుగా ఇచ్చారు. ఆరులక్షలు వస్తే ఆత్మహత్య చేసుకు న్న కుటుంబాలవారికి సహాయం చేశాం. చాలా మంది మా ఊరిలో ప్రదర్శించమని ముందుకు వచ్చారు.వాళ్లే ఖర్చులు పెట్టుకున్నా రు. సిటీలోని గేటెడ్‌ కమ్యూనిటీల్లో రైతుల గురించి ఈతరానికి తెలిసేలా షోలు ఏర్పాటు చేశారు.రైతు కష్టం అందరికీ తెలియాలని దీనిని యూట్యూబ్‌ లో అప్‌ లోడ్‌ చేశాం. మాకు పేరు రాకున్నా , కమర్షియల్‌‌‌‌‌‌‌‌గా హిట్‌ కాకున్నా మేం చెప్పాలనుకున్నది రైతుకు చేరుతున్నది. ఇదేమా విజయం

చెదిరిన కల

నాన్న బ్యాంక్‌ మేనేజర్‌ . ముంబయిలోఉద్యోగం. 15 ఏళ్ల వయసు వరకు అక్కడే పెరిగాను. ప్రొఫెషనల్‌ క్రికెటర్‌ గాఎదగాలన్నది ఆనాటి కల. నిజం చేసుకోవాలని చాలా కష్టపడ్డా ను. ఆ కష్టానికి తగ్గ ఫలితం ముంబయి క్రికెట్‌అసోసియేషన్‌ టీమ్‌ కు ఎంపికయ్యాను. ఆ తర్వాత మా కుటుంబం హైదరాబాద్‌ కుమారింది. ఇక్కడ కూడా మడమ తిప్పకుండా బ్యాటిం గ్‌ చేశాను. అండర్‌ 19 క్రికెట్‌ లో హైదరాబా ద్‌ జట్టు తరఫున ఆడాను. మా అమ్మ అవంతి కాలేజ్‌ (హైదరాబా ద్‌ )లోలెక్చరర్‌ గా పనిచేస్తోంది. ఇంట్లో ఇష్టమైన పనిచేయడానికి మంచి ప్రోత్సాహం ఉండేది. కానీ నా కల నెరవేరలేదు.  .::: నాగవర్ధన్‌ రాయల