రెండు మిలియన్​ డాలర్లు సేకరించనున్న సిటీ​ స్టార్టప్​ పౌల్ట్రీమాన్

 రెండు మిలియన్​ డాలర్లు సేకరించనున్న సిటీ​ స్టార్టప్​ పౌల్ట్రీమాన్

హైదరాబాద్, వెలుగు : సిటీ​ స్టార్టప్​ పౌల్ట్రీమాన్ త్వరలో మరో రెండు మిలియన్​ డాలర్ల వరకు (రూ.16.4 కోట్ల) ఫండ్స్​ను సేకరించనుంది. ఇది కోళ్లఫారాల్లో, హాచరీల్లో ఉష్ణోగ్రత, తేమ, అమ్మోనియా, వాటర్​ పీహెచ్​ వంటి వివరాలను  యాప్​ ద్వారా ఓనర్​కు అందిందిస్తుంది.  ఇది వరకే ఇద్దరు ఇన్వెస్టర్ల నుంచి రూ.ఐదు కోట్ల ఇన్వెస్ట్​మెంట్లు సేకరించామని సంస్థ ఎండీ చిందం శ్రీనివాస్​ చెప్పారు. ఈ విషయమై ఆయన ‘వెలుగు’తో మాట్లాడుతూ ‘‘ఐటీసీ అగ్రో సీనియర్​ ఎగ్జిక్యూటివ్​ శివకుమార్​తో పాటు పాన్​టాక్​ అనే వెంచర్​ క్యాపిటల్​ సంస్థ మా స్టార్టప్​లో పెట్టుబడులు పెట్టింది. సొంతంగా నేను రూ.3 కోట్లు ఇన్వెస్ట్​ చేశాను. మరో 1–2 మిలియన్​ డాలర్లను వీసీ కంపెనీల నుంచి సేకరిస్తాం.

మాకు ఐఐటీ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌–కాశీపూర్​, కేంద్రం ప్రభుత్వం నుంచి గ్రాంట్లు కూడా వచ్చాయి. మేం అందజేసే ఐఓటీ డివైజ్​, స్మార్ట్​ఫోన్​ యాప్​ ద్వారా కోళ్లఫారాల్లో, హాచరీల్లోని వివరాలను రియల్​టైంలో తెలుసుకోవచ్చు. నెట్​లోని లేని చోట శాటిలైట్​ టెక్నాలజీని వాడేందుకు ప్రయత్నిస్తున్నాం. త్వరలో ఎగ్​గ్రేడింగ్​, బర్డ్​ బిహేవియర్​ టెక్నాలజీలను అందుబాటులోకి తెస్తాం. పౌల్ట్రీమాన్  టెక్నాలజీకి పేటెంట్​ ఉంది. ప్రస్తుతం మాకు 40 మంది కస్టమర్లు ఉన్నారు. వీటిలో సుగుణ, గోద్రెజ్​ వంటి పెద్ద కంపెనీలూ ఉన్నాయి. విదేశీ మార్కెట్లలోకి కూడా వెళ్తాం. గత ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షల టర్నోవర్​ సాధించాం. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 కోట్లు వస్తాయని అనుకుంటున్నాం’ అని అన్నారు.