సివిల్స్ ర్యాంకర్లకు కేటీఆర్ విషెస్

సివిల్స్ ర్యాంకర్లకు కేటీఆర్ విషెస్

సివిల్ సర్వీసెస్ 2021 ఫలితాలు.. కఠోర శ్రమ, సంకల్పంతో కూడిన కొన్ని అద్భుతమైన కథలను తెరపైకి తీసుకువచ్చాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫలితాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ముగ్గురు బాలికలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణ నుంచి ఎంపికైన ర్యాంకర్లందరికీ నా అభినందనలు అని మెచ్చుకున్నారు . మీ కృషితో భారతదేశాన్ని  ప్రపంచానికి నడిపిస్తారని ఆశిస్తున్నానంటూ ఆయన తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. 

ఇకపోతే ఇటీవల రిలీజైన సివిల్స్‌‌ 2021 ఫలితాలలో తెలుగోళ్లు సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌‌సీ) సోమవారం విడుదల చేసిన సివిల్స్‌‌–2021 ఫలితాల్లో 40 మందికి పైగా ఎంపియ్యారు. వందలోపు ర్యాంకుల్లో 12 మందికి పైగా తెలుగోళ్లు ఉన్నారు. తెలంగాణ టాపర్‌‌‌‌గా హైదరాబాద్‌‌కు చెందిన సంజన సింహా నిలిచారు. ఆమె 37వ ర్యాంకు సాధించారు. గతంలోనే సివిల్స్ ర్యాంక్ సాధించిన సంజన.. ఇన్‌‌కం ట్యాక్స్ డిపార్ట్‌‌మెంట్‌‌లో ఉద్యోగం పొందారు. ప్రస్తుతం నాగ్​పూర్‌‌‌‌లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇక తెలుగు రాష్ర్టాల టాపర్‌‌‌‌గా కర్నూల్ జిల్లాకు చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డి (15వ ర్యాంకు) నిలిచారు. మరోవైపు తెలుగు అమ్మాయిలు తమ హవా కొనసాగించారు.

మరిన్ని వార్తలు..

దేశంలోనే మొదటి సోలార్ బోట్‌‌‌‌ ఇది!

స్పైస్ జెట్ కు రూ.10 లక్షల జరిమానా