స్పైస్ జెట్ కు రూ.10 లక్షల జరిమానా

స్పైస్ జెట్ కు రూ.10 లక్షల జరిమానా

రాంచీలో వికలాంగ చిన్నారిని దించిన కేసులో ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ.5లక్షల జరిమానా విధించిన ఘటన మరువక ముందే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) మరో విమాన సంస్థకు పెనాల్టీ వేసింది. బోయింగ్ 737 మాక్స్ విమానం పైలట్లకు లోపభూయిష్టమైన సిమ్యులేటర్‌పై శిక్షణ ఇచ్చినందుకు గానూ స్పైస్ జెట్ పై రూ.10 లక్షల జరిమానాను ఖరారు చేసింది. దీని వల్ల విమాన భద్రతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ఈ ఫైన్ వేసినట్టు తెలుస్తోంది. గతనెలలో 90మంది  స్పైస్‌జెట్ పైలట్‌లు మాక్స్ విమానాలను నడపకుండా నిషేధం విధించిన DGCA... ఆ తర్వాత సదరు విమాన సంస్థకు షోకాజు నోటీసును కూడా జారీ చేసింది.

 

మరిన్ని వార్తల కోసం..

గ్రూప్1 పోస్టులకు భారీగా దరఖాస్తులు

మంచిప్ప రిజర్వాయర్ ఖర్చెక్కువ..సాగు తక్కువ