మహబూబాబాద్ జిల్లాలోని రైస్ మిల్లులపై సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. మహాబూబాద్ లోని మాజీ మంత్రి రెడ్యానాయక్ కు చెందిన శ్రీలక్ష్మీ పారాబాయిల్డ్ మిల్లులో తనిఖీలు చేసిన సివిల్ సప్లయ్ అధికారులు.. మిల్లింగ్ చేసిన కోట్ల రూపాయల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదని గుర్తించారు.
మొత్తం 6కోట్ల 49 లక్షల 33వేల రూపాయల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించలేదని నిర్దారణ జరిగింది. దీంతో మిల్లు యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సివిల్ సప్లయ్ టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు.