ఈ కాలంలో నిజం బాధితురాలిగా మారింది

ఈ కాలంలో నిజం బాధితురాలిగా మారింది

ఈ కాలంలో నిజం బాధితురాలిగా మారిందని సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ అన్నారు. దీనికి కారణం తప్పుడు వార్తల ప్రచారమని తెలిపారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన లా ఇంన్ ది ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్ ఈవెంట్లో మాట్లాడిన జస్టిస్ చంద్రచూడ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సోషల్‌ మీడియా ప్రభావం ప్రజలపై చాలా ఉంది. దానివల్ల చాలామంది నిజాన్ని వాస్తవాల ఆధారంగా నిర్ధారించుకోవడం లేదన్నారు జస్టిస్. ప్రజల్లో సహనం తక్కువగా ఉంది. వాళ్ల దృష్టిని భిన్నంగా ఉన్నవాటిని ఆమోదించడం లేదన్నారు. మనం చేసే ప్రతి పనికి మన ఆక్సెప్ట్ చేయని వాళ్ల దృష్టినుంచి ట్రోలింగ్‌ ఎదుర్కోవాల్సి వస్తున్నదన్నారు. 

ట్విట్టర్ లాంటి మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్స్ వల్ల ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని జస్టిస్ చంద్రచూడ్‌ పేర్కొన్నారు. వీటివల్ల భౌతిక దాడులు ఎదుర్కొంటున్నా వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి ఘటనలు సుప్రీం కోర్టు వరకు వచ్చాయి. వాటిపై చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశాం. మహిళలకు అన్ని రంగాల్లో హక్కులు కల్పించాలని కోరారు. దానికోసం తనవంతు కృషి తప్పక చేస్తానని హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఎక్కువ మంది మహిళా న్యాయమూర్తులను నియమించే విషయానికి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఖచ్చితంగా మద్దతిస్తానని తెలిపారు.