యాదాద్రిని దర్శించుకున్న ఎన్వీ రమణ దంపతులు

V6 Velugu Posted on Jun 15, 2021

యాదాద్రి నారసింహుడిని దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ N.V. రమణ దంపతులు. యాదాద్రిలోని జస్టిస్ N.V. రమణకు... మంత్రులు జగదీశ్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, విప్ గొంగడి సునీత స్వాగతం పలికారు. తర్వాత ఆలయ అధికారులు, పూజారులు... పూర్ణకుంభ స్వాగతం పలికారు. స్వామి వారి దర్శనం తర్వాత... జస్టిస్ N.V. రమణ దంపతులకు పండితులు వేద ఆశీర్వచనం చేశారు. దర్శనం తర్వాత ఆలయ పునర్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్నారు. రాతి కట్టడాలు, కృష్ణ శిలల గోపురాలను పరిశీలిస్తున్నారు. ప్రదానాలయానికి ఉత్తర దిశలో నిర్మాణ పనులను చూడనున్నారు. యాదాద్రి పర్యటన తర్వాత తిరిగి హైదరాబాద్ రానున్నారు జస్టిస్ N.V. రమణ దంపతులు.

Tagged Yadadri Temple, visite, CJI Justice NV Ramana

Latest Videos

Subscribe Now

More News