బండిXఈటల.. హుజూరాబాద్ బీజేపీలో లొల్లి.. పార్టీలో గ్రూపుల్లేవంటున్న బండి.. తమకు ప్రయార్టీ లేదన్న ఈటల వర్గం

బండిXఈటల.. హుజూరాబాద్ బీజేపీలో లొల్లి..  పార్టీలో గ్రూపుల్లేవంటున్న బండి.. తమకు ప్రయార్టీ లేదన్న ఈటల వర్గం

ఎంపీ ఎలక్షన్లలో పార్టీకి  హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని 

కొందరు నాయకులు పనిచేశారని ఆరోపణ

ఎక్కడా లేని  సమస్య  ఇక్కడే ఎందుకు వస్తుందని కామెంట్

శామీర్ పేట నివాసానికి వచ్చి ఆందోళన

 

బండి ఏమన్నారంటే..
‘ బీజేపీలో వర్గమనే ఉండదు.. అందరూ పార్టీ కోసమే పనిచేయాలి. ఒకాయన చేరినప్పుడు నేను అంత యాక్టీవ్ గా లేను.. పార్టీలో ఎక్కడా లేని పంచాయతీలు హుజూరాబాద్ లోనే ఎందుకు వస్తుంది. ఎంపీ ఎలక్షన్ల పార్టీకి  హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొందరు పనిచేసిండ్రు.. వాళ్లకు టికెట్లు ఇవ్వుమంటవా..? ఎవరు ఏ వర్గమో నాకేం తెలుస్తది. వ్యక్తి కోసం పనిచేస్తే టికెట్లు ఇవ్వం. 


 హైదరాబాద్: బీజేపీలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్ గిరి ఎంపీ ఈటల వర్గాల మధ్య రచ్చ ఇవాళ (జులై 19) మరోమారు బహిర్గతమైంది. తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని పేర్కొంటూ హుజూరాబాద్ నియోజకవర్గానికి  చెందిన కొందరు శామీర్ పేటలోని ఈటల రాజేందర్ నివాసానికి చేరుకున్నారు.  రెండు రోజుల క్రితం హుజూరాబాద్ లో బండి సంజయ్ విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి తమకు కనీస సమాచారం ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు.

 స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో తమ భవిష్యత్ ఏమిటని వారు ఈటలను ప్రశ్నిస్తున్నారు. 25 ఏళ్లుగా ఈటల వెంట ఉన్నామని సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికల్లో తమకు సీట్లు కేటాయించాలంటున్నారు. సైకిళ్ల పంపిణీకి వచ్చిన బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో వర్గాలు ఉండవన్నారు. వ్యక్తుల కోసం పనిచేస్తే టికెట్లు రావని కుండబద్దలు కొట్టారు. ఎక్కడా లేని పంచాయితీ హుజురాబాద్ లోనే ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. పార్టీ జెండా కోసం పనిచేసినోళ్లకు భవిష్యత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. 

పరోక్షంగా ఈటలను ఉద్దేశిస్తూ.. ఒకాయన పార్టీలో చేరినప్పుడు తాను అంత యాక్టీవ్ గా లేనని చెప్పుకొచ్చారు. ఎవరి రాజకీయ భవిష్యత్ వారిదేనని కూడా అన్నారు. లోక్  సభ ఎన్నికల్లో పార్టీకి హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని పనిచేశారని, ఆ డీటెయిల్స్ తన వద్ద ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాళ్లకు టికెట్లు ఇవ్వుమంటారా? అని ప్రశ్నించారు. ఎవరు ఏ వర్గమో నాకేం తెలుస్తుందనీ అన్నారు. 

కాళేశ్వరం విచారణ తర్వాత మారిన సీన్

మల్కజ్ గిరి ఎంపీ, మాజీ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ఇటీవల కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు  హాజరయ్యారు. ఈ సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కేబినెట్ ఆమోదంతోనే జరిగిందని, సింగిల్ గా ఆయన నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమని అన్నారు. కాళేశ్వరం కారణంగానే తెలంగాణకు జలకళ వచ్చిందనీ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో కేంద్ర  మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ ‘కాళేశ్వరంపై మోదీ చెప్పిందే బీజేపీ విధానం. 

కాళేశ్వరంపై బీజేపీ స్టాండ్ మారిందని, బీఆర్ఎస్‌తో కుమ్మక్కైందని కొంతమంది విష ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో బీజేపీ స్టాండ్ వెరీ క్లియర్. కాళేశ్వరం ప్రాజెక్టులో పనిచేసిన అధికారులే వందల కోట్లు సంపాదించారంటే, ఇక కేసీఆర్ కుటుంబం ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు.  ''మేం మాట మార్చడానికి ఊసరవెల్లులం కాదు. నేను గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని, ఇప్పుడు కేంద్ర మంత్రిని. కాబట్టి అప్పుడో మాట, ఇప్పుడో మాట చెప్పొచ్చా? ’ అన్నారు.   

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్,  నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే రామారావు, కాగజ్ నగర్ ఎమ్మెల్యే హరీశ్... వీళ్లంతా కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద స్కామ్ అని, సీబీఐ విచారణ జరగాలని, బండి సంజయ్ చెప్పిందే పార్టీ విధానమని ప్రకటనలు చేశారు. ఈ క్రమంలో ఈటల ఒంటరిగా మిగిలిపోయారు.

పార్టీ అధ్యక్ష పదవి రాలే

కాళేశ్వరంపై ఈటల చేసిన వ్యాఖ్యలు ఆయన మెడకే చుట్టుకున్నాయి. ఈ క్రమంలో ముందటి దాకా వచ్చిన అధ్యక్ష పదవి కాస్తా దూరమైందనే టాక్ పార్టీలో ఉంది. అదే నియోజకవర్గానికి చెందిన నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ ను బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. 

బండి ఏమన్నారంటే..

‘ బీజేపీలో వర్గమనే ఉండదు.. అందరూ పార్టీ కోసమే పనిచేయాలి. ఒకాయన చేరినప్పుడు నేను అంత యాక్టీవ్ గా లేను.. పార్టీలో ఎక్కడా లేని పంచాయతీలు హుజూరాబాద్ లోనే ఎందుకు వస్తుంది. ఎంపీ ఎలక్షన్ల పార్టీకి  హుజూరాబాద్ లో తక్కువ ఓట్లు రావాలని కొందరు పనిచేసిండ్రు.. వాళ్లకు టికెట్లు ఇవ్వుమంటవా..? ఎవరు ఏ వర్గమో నాకేం తెలుస్తది. వ్యక్తి కోసం పనిచేస్తే టికెట్లు ఇవ్వం.