జనగామలో ఉద్రిక్తత.. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట

జనగామలో ఉద్రిక్తత..  బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య  తోపులాట

 తెలంగాణలో ఎన్నికల సందర్భంగా పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. జనగామ రైల్వే స్టేషన్‌ సమీపంలోని పోలింగ్ బూత్  వద్ద కాంగ్రెస్., బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య  తోపులాట జరిగింది. 

బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎక్కువసేపు  పోలింగ్ బూత్ ఉంటున్నాడని కాంగ్రెస్ కార్యకర్తలు అభ్యంతరం  వ్యక్తం చేశారు.  ఈ క్రమంలో  కాంగ్రెస్. బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ మొదలైంది. వెంటనే స్పందించిన పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. 

నిజామాబాద్‌ జిల్లా బోధన్‌లో విజయమేరి  పోలింగ్‌ కేంద్రం వద్ద కాంగ్రెస్‌, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో   పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి చెదరగొట్టారు.  మరోవైపు ఇబ్రహీంపట్నం ఖానాపూర్‌లో బీఆర్ఎస్,  కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది.  పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు.