క్లాసి కార్వర్ వెహికల్: వావ్..ఈ త్రీవీలర్ భలే బాగుంది..

క్లాసి కార్వర్ వెహికల్: వావ్..ఈ త్రీవీలర్ భలే బాగుంది..

వావ్.. ఈ వెహికల్ భలే బాగుంది. మూడు చక్రాలున్నాయి. కానీ ఆటో కాదు.. వెరైటీగా ఉంది. రోడ్లపై జెట్ స్పీడ్ తో దూసుకుపోతోంది. దీన్ని ఒక్కసారి చూశారంటే.. చూపు తిప్పుకోలేరు.. అలాంటి వాహనం రద్దీగా ఉండే ముంబై నగరంలోని వర్లీ ప్రాంతంలో  సిగ్నల్ దగ్గర కనిపించింది. ఈ వింత వాహనాన్ని చూసిన జనం ఇదేంటి వెహికల్ అంటూ ఆశ్చర్యంగా కళ్లప్పగించి చూశారు. ఓ వెహికల్స్ ప్రేమికుడు దీనిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.. ఇప్పుడు వైరల్ అవుతోంది. మూడు చక్రాలతో అద్భుతమైన ఆకట్టుకునే లుక్ తో ముంబై వాసులతో పాటు, నెటిజన్ల దృష్టిని కూడా ఆకర్షించింది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కారు. వివరాలేంటో తెలుసుకుందాం.. 

అమిత్ భవాని అనే ట్రావెల్ లవర్ ఈ  వీడియోను Xలో షేర్ చేశారు. ముంబై నగరంలోని వర్లీ ప్రాంతంలో ఓ సిగ్నల్ దగ్గర ఈ వాహనం కనిపించింది. దీన్ని చూసిన జనం అవాక్కయ్యారు. మూడు చక్రాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్ల కూడా దీని గురించి చర్చ పెట్టారు. వింతగా, అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న ఈ వాహనాన్ని బాగా పరిశీలించి దానికి సంబంధించిన డిటెయిల్స్ ను కూడా షేర్ చేశారు అమిత్ భవాని. 

ఈ వాహనం లింక్స్ లీన్ ఎలక్ట్రిక్ టు సీటర్ టిల్టింగ్ వెహికల్ అంట..డెన్మార్క్ కు చెందిన లింక్స్ కార్స్ కంపెనీ ద్వారా ఈ మూడు చక్కాల వాహనం తయారు చేబడిందట. ఈ వాహనం త్రి వీలర్ కార్వర్ అని.. 100 శాతం ఎలక్ట్రిక్ వెహికల్.ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కమ్ కారు ధర భారత్ లో రూ. 10లక్షలు ఉంటుందట. అదే డెన్మార్క్ లో అయితే దీని ధర 35000 యూరోలు.