అమ్మకాల ఒత్తిడితో నష్టాలు.. సెన్సెక్స్ 542 పాయింట్లు డౌన్..157 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

అమ్మకాల ఒత్తిడితో నష్టాలు.. సెన్సెక్స్ 542 పాయింట్లు డౌన్..157 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ముంబై:  బ్లూ-చిప్ స్టాక్స్‌‌లో ప్రాఫిట్​ బుకింగ్​, విదేశీ పెట్టుబడులు వెళ్లిపోవడంతో గురువారం ఈక్విటీ మార్కెట్లు పడ్డాయి. బెంచ్‌‌మార్క్ సెన్సెక్స్ 542.47 పాయింట్లు నష్టపోయింది. ఇది మొదట్లో సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ,  ఊపును కొనసాగించడంలో విఫలమైంది.  చివరికి 542.47 పాయింట్లు క్షీణించి 82,184.17 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 679.42 పాయింట్లు కుంగి 82,047.22 వద్దకు చేరుకుంది. బీఎస్‌‌ఈలో 2,410 స్టాక్‌‌లు లాభాలతో, 1,645 లాభాలతో ముగిశాయి. 50 షేర్ల ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీ 157.80 పాయింట్లు పడి 25,062.10 వద్ద ముగిసింది. 

సెన్సెక్స్ సంస్థలలో, ట్రెంట్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్‌‌సర్వ్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్‌‌సీఎల్ టెక్నాలజీస్,  ఎన్‌‌టీపీసీ ఎక్కువగా నష్టపోయాయి. అయితే, ఎటర్నల్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, టాటా స్టీల్,  టైటాన్ లాభపడ్డాయి. జూన్ క్వార్టర్లీ రిజల్ట్స్​ మెప్పించకపోవడంతో  ఇన్ఫోసిస్ స్టాక్​ ఒక శాతానికి పైగా క్షీణించింది. బీఎస్​ఈ స్మాల్ క్యాప్ గేజ్ 0.50 శాతం, మిడ్‌‌క్యాప్ ఇండెక్స్ 0.43 శాతం నష్టపోయింది. 

బీఎస్​ఈ సెక్టోరల్​ ఇండెక్స్​లలో  బీఎస్​ఈ ఫోకస్డ్ ఐటీ 2.27 శాతం, ఐటీ 1.90 శాతం, టెక్ 1.54 శాతం, ఎఫ్ఎంసీజీ 1.09 శాతం,  రియాలిటీ 1.03 శాతం పడిపోయాయి. హెల్త్‌‌కేర్, ఆటో,  మెటల్ లాభపడ్డాయి. బుధవారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్​ఐఐలు) రూ.4,209.11 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మగా, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (డీఐఐలు) రూ.4,358.52 కోట్ల విలువైన స్టాక్‌‌లను కొన్నారు.

లాభాల్లో ఆసియా మార్కెట్లు..

ఆసియా  మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి, జపాన్‌‌కు చెందిన నిక్కీ 225 ఇండెక్స్, షాంఘైకి చెందిన ఎస్‌‌ఎస్‌‌ఇ కాంపోజిట్ ఇండెక్స్,  హాంకాంగ్‌‌కు చెందిన హాంగ్ సెంగ్ లాభాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు గ్రీన్​లో ట్రేడవుతున్నాయి. బుధవారం యూఎస్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.  గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్‌‌ ధర 1.24 శాతం పెరిగి 69.36 డాలర్లకు చేరుకుంది. బుధవారం, సెన్సెక్స్ 539.83 పాయింట్లు పెరిగి 82,726.64 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 159 పాయింట్లు పెరిగి 25,219.90 వద్ద
 స్థిరపడింది.