గద్వాల జిల్లాలో షార్ట్  సర్క్యూట్ తో బట్టల షాప్  దగ్ధం

గద్వాల జిల్లాలో షార్ట్  సర్క్యూట్ తో బట్టల షాప్  దగ్ధం

గద్వాల, వెలుగు: జిల్లా కేంద్రంలో బుధవారం షార్ట్  సర్క్యూట్ తో బట్టల షాపు దగ్ధమై రూ.80 లక్షల ఆస్తి నష్టం జరిగింది. బాధితుడు కొంకతి చంద్రబాబు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని చిన్న అగ్రహారంలో బట్టల షాపు నడుపుతున్నాడు. బుధవారం ఉదయం మూసి ఉన్న షాప్​ నుంచి మంటలు రావడంతో చుట్టుపక్కల వాళ్లు ఓనర్ కు సమాచారం ఇచ్చారు. ఫైర్  ఇంజన్ కు సమాచారం ఇవ్వగా, వాళ్లు వచ్చేసరికే షాపులో బట్టలు మొత్తం దగ్ధమైనట్లు వాపోయాడు.

ఘటనా స్థలాన్ని జడ్పీ చైర్​పర్సన్  సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, బీజేపీ నాయకులు డీకే స్నిగ్దారెడ్డి, రాంచంద్రారెడ్డి, బండల వెంకట్రాములు పరిశీలించి, బాధితుడిని పరామర్శించారు. విద్యుత్​ శాఖ నుంచి బాధితుడికి పరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.