హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు

హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయిలో వరదలు సంభంవించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. క్లౌడ్ బరస్ట్ కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో వచ్చిన ఆకస్మిక వరదలతో సోలాంగ్ నుంచి మనాలికి కలిపే చెక్క వంతెన కొట్టుకుపోయింది. మనాలీలోని పల్చన్ సెరి వద్ద కురిసిన కుండపోత వానకు బియాస్ నది మహోగ్రరూపం దాల్చింది. మనాలిలోని వశిష్ట చౌక్ దగ్గర నది పొంగిపొర్లుతోంది. నదీ పరివాహాక ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరింది. అకస్మాత్తుగా వచ్చిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

క్లౌడ్ బరస్ట్ కారణంగానే హిమాచల్ ప్రదేవ్లోని మనాలిలో భారీ వర్షాలు, వరదలు పోటెత్తాయని అధికారులు చెప్పారు. నది పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు . మరికొన్ని రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటించింది. అయితే భారీ వర్షాలు, వరద  ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అధికారులు ముందు జాగ్రత్త చర్యగా లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.