టీఆర్ఎస్, బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పాలి: భట్టి విక్రమార్క

టీఆర్ఎస్, బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్పాలి: భట్టి విక్రమార్క

అధికార పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు పై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క స్పందించారు. ఇదంతా రెండు పార్టీలు కలిసి ఆడుతున్న నాటకమని ఆయన అన్నారు. ఎమ్మెల్యేలను కొనటం కేసీఆర్ కు కొత్తకాదని ఆయన చెప్పారు. గతంలో 12 మంది కాంగ్రెస్ సభ్యులను కేసీఆర్ ప్రభుత్వం ఎలా కొనుగోలు చేసిందో దేశమంతా, రాష్ట్రమంతా తెలుసని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ పైనా భట్టి విమర్శలు చేశారు. ఇతర పార్టీలో గెలిచిన వారిని కేంద్రంలో ఉన్న మోడీ.. అధికారిన్ని అడ్డుపెట్టుకుని కొనుగోలు చేశారని మండిపడ్డారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయని ఆయన అన్నారు. 

ఒకరు కొన్నట్లు, ఒకరు అమ్మినట్లు.. 100 కోట్ల డ్రామా నడిపించి.. ప్రజలను గందరగోళంలో పడేశారని భట్టి అన్నారు. రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పాల్సింది ప్రజలేనని ఆయన తెలిపారు. బేరం పెట్టింది నలుగురా.. నలభై మందో తెలియదన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరచాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ రెండు పార్టీలు చేసే నాటకాల వల్ల కాంగ్రెస్ పార్టీ పై ఎలాంటి ప్రభావం ఉందడని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.