జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారంలో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. డివిజన్ల వారీగా మంత్రులకు ప్రచార బాధ్యతలు అప్పగించారు సీఎం రేవంత్. మంత్రులను క్యాంపెయినర్లుగా నియమించి.. వివిధ ఏరియాల్లో ప్రచారం చేయించేలా నిర్ణయం తీసుకుంది.
అందులో భాగంగా నియోకవర్గంలోని షేక్ పేట డివిజన్ ప్రచార బాధ్యతలు మంత్రులు వివేక్ వెంకటస్వామి, కొండా సురేఖకు అప్పగించారు. యూసుఫ్ గూడ బాధ్యతలు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ కు అప్పగించారు. రహమత్ నగర్ డివిజన్ ప్రచార బాధ్యతలను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు అప్పగించారు.
►ALSO READ | Cyclone Montha: తీరానికి దగ్గరగా భీకర్ తుఫాన్ మోంథా: ఈ రాత్రి కోస్తా జిల్లాల్లో ప్రయాణాలు వద్దు
అదేవిధంగా ఎర్రగడ్డ డివిజన్ లో మంత్రులు దామోదర రాజనర్సింహా, జూపల్లి కృష్ణారావు ప్రచారం చేస్తారు. బోరబండ డివిజన్ లో మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి ప్రచారం చేస్తారు. వెంగళ్ రావు నగర్ డివిజన్ బాధ్యతలను మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి అప్పగించారు. సోమాజిగూడ డివిజన్ లో మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్ ప్రచారం చేస్తారు. .
