శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటన.. నంద్యాల జిల్లా నేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్...

శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటన.. నంద్యాల జిల్లా నేతలతో చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్...

ఏపీలో అక్టోబర్​ 16.. గురువారం  ప్రధాని నరేంద్ర మోదీ  పర్యటిస్తున్నారు.  ప్రధాని శ్రీశైలంపర్యటన సందర్భంగా  (అక్టోబర్​ 15.. ) సీఎం చంద్రబాబు  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, నంద్యాల, కర్నూలు జిల్లా  ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో సీఎం మాట్లాడారు. ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలని నేతలకు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి. రేపు (అక్టోబర్​ 16)  ప్రధానమంత్రి నరేంద్రమోదీ శ్రీశైలం, కర్నూలు పర్యటనలను గ్రాండ్ సక్సెస్ చేయాలన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలు చేకూరుతున్నాయని తెలిపారు.

కేంద్ర సహకారంతో అనేక పాలసీలు, సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రానికి పెద్దఎత్తున లాభం చేకూరుతోందని అన్నారు. ఏపీలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేసేందుకు ఢిల్లీలో  గూగుల్ సంస్థతో ఒప్పందం చేసుకున్నామని ఇది చారిత్రాత్మక నిర్ణయమని హర్షం వ్యక్తం చేశారు. ఏపీకి గూగుల్ రావడానికి ఐటీ మంత్రి లోకేష్ ప్రధాన పాత్ర పోషించారని సీఎం చంద్రబాబు తెలిపారు. 

►ALSO READ | వైజాగ్ లో గూగుల్ భారీ పెట్టుబడి.. ఏఐ హబ్ కోసం 1.33 లక్షల కోట్లు