రైతు సేవా కేంద్రాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

రైతు సేవా కేంద్రాలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

గురువారం ( అక్టోబర్ 9 ) సచివాలయంలో వ్యవసాయ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఈ సమావేశంలో రైతు సేవా కేంద్రాలపై కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. రైతు సేవా కేంద్రాలను రీ ఓరియెంటేషన్ చేసేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలపై ఆధారపడిన రైతులకు సేవలందించేలా రైతు సేవా కేంద్రాలను తీర్చిదిద్దాలని అన్నారు. రైతులకు వివిధ రకాల ప్రభుత్వ సేవలు అందించే విషయంలో రైతు సేవా కేంద్రాలే కీలక పాత్ర పోషించాలని అన్నారు.

మంచి పోషక విలువలు అందించటం ద్వారా భూసారం పెంచాలని.. దాని ద్వారా ఉత్పాదకత పెంచాలని అన్నారు. 2026 ఖరీఫ్ సీజన్లో సేంద్రీయ సాగు చేసేలా, రసాయన ఎరువుల వినియోగం తగ్గించేలా రైతుల్లో అవగాహన పెంచాలని అన్నారు. ప్రకృతి సేద్యం ద్వారా పర్యావరణంతో పాటు ఆరోగ్యపరంగా, ఆర్ధికంగా జరిగే ప్రయోజనాలు రైతులకు వివరించాలని అన్నారు చంద్రబాబు.

ఎలాంటి మార్పులు జరగాలన్నా క్షేత్రస్థాయిలో ఉండేవారికి పూర్తి స్థాయి అవగాహన ఉండేలా చూడాలని అన్నారు.భూసారం పెంచే పోషకాల విషయంలో లోపాలను సవరించి తదుపరి ప్రణాళికలు చేసుకోవాలని అన్నారు సీఎం చంద్రబాబు.