CRDA హెడ్ ఆఫీసు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. అమరావతి రీస్టార్ట్ అయ్యాక తొలి ప్రభుత్వ భవనం..

CRDA హెడ్ ఆఫీసు ప్రారంభించిన సీఎం చంద్రబాబు.. అమరావతి రీస్టార్ట్ అయ్యాక తొలి ప్రభుత్వ భవనం..

అమరావతిలో CRDA ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సోమవారం ( అక్టోబర్ 13 ) అమరావతికి భూములిచ్చిన రైతులతో కలిసి సీఆర్డీఏ భవనాన్ని ప్రారంభించారు చంద్రబాబు. రాజధాని రీస్టార్ట్ అయ్యాక ప్రారంభమైన తొలి ప్రభుత్వ భవనం ఇదే కావడం విశేషం. రూ. 257 కోట్లతో 4.32 ఎకరాల్లో ఈ భవనాన్ని నిర్మించారు. A ఆకారం వచ్చేలా ఆఫీసు ముందు భాగంలో డిజైన్ చేశారు. 

ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో కమాండ్ కంట్రోల్ సెంటర్, ఫస్ట్ ఫ్లోర్ లో కాన్ఫరెన్స్ హాళ్లు, రెండు, మూడు, ఐదు అంతస్తుల్లో ఆఫీసులు ఉండనున్నాయి. 6వ అంతస్తులో ADCL కార్యాలయం, 4, 7 అంతస్తుల్లో మున్సిపల్ శాఖ కార్యాలయాలు ఉండనున్నాయి. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. హైదరాబాద్ ను మించిన రాజధాని నిర్మించాలన్నదే తన లక్ష్యమని అన్నారు.అమరావతి గ్రీన్ ఫీల్డ్ రాజధాని అని.. ప్రపంచం మొత్తం మనవైపు చూసేలా రాజధాని నిర్మాణం ఉంటుందని అన్నారు చంద్రబాబు. హైదరాబాద్ ను బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశానని అన్నారు.

ల్యాండ్ పూలింగ్ లో భూములిచ్చి రైతులు తనకు ధైర్యమిచ్చారని అన్నారు చంద్రబాబు. రాజధాని కోసం పెద్దఎత్తున భూములు అవసరమని అన్నారు. రాజధానిలో ఫస్ట్ బిల్డింగ్ సీఆర్డీఏ బిల్డింగ్ అని.. ఇది ఆరంభం మాత్రమే, త్వరలోనే మరిన్ని ప్రభుత్వ భవనాలు వస్తాయని అన్నారు చంద్రబాబు.