కుప్పంలో కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి..

కుప్పంలో కృష్ణమ్మకు సీఎం చంద్రబాబు జలహారతి..

శనివారం ( ఆగస్టు 30 ) చిత్తూరు జిల్లా కుపంలో పర్యటించారు సీఎం చంద్రబాబు. ఈ పర్యటనలో భాగంగా కృష్ణమ్మకు జలహారతి సమర్పించారు సీఎం చంద్రబాబు. కుప్పం మండలం పరమాసముద్రం చెరువు దగ్గర హంద్రీనీవా జలాలకు జలహారతి సమర్పించారు సీఎం చంద్రబాబు. వేద పండితుల మంత్రాల నడుమ కృష్ణాజలాలకు హారతి సమర్పించారు సీఎం చంద్రబాబు. కృష్ణాజలాలకు హారతి ఇచ్చి సారె సమర్పించారు సీఎం చంద్రబాబు. 

కృష్ణాజలాలు హంద్రీనీవాకు కొత్త కళ తెచ్చాయి. పరమాసముద్రం చెరువు కుప్పం పలమనేరులోని 110 చెరువులను అనుసంధానం చేయడానికి మార్గం ఏర్పడిందని తెలిపారు అధికారులు. రాయలసీమ ఆయువుపట్టుగా భావించే హంద్రీనీవా సుజలస్రవంతి కాల్వకు నంద్యాల సమీపంలోని మల్యాల ఎత్తిపోతల దగ్గర జులై 17న కృష్ణాజలాలను విడుదల చేశారు. ఆగస్టు 23న కుప్పం నియోజికవర్గం పరిధిలోని రామకుప్పం మండలం వారికుప్పం మండలం దగ్గరకు కృష్ణాజలాలు చేరాయి. ఆగస్టు 25న పరమాసముద్రంలోకి చేరాయి కృష్ణజలాలు.

►ALSO READ | శ్రీశైలం నుంచి 738 కి.మీ. ప్రయాణించి.. కుప్పం చేరిన కృష్ణా జలాలు.. సీఎం చంద్రబాబు జలహారతి

ఈ క్రమంలో జలహారతి తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొననున్నారు సీఎం చంద్రబాబు.అనంతరం వివిధ కంపెనీల ప్రతినిధులతో ఎంఓయూలు చేసుకోనున్నట్లు సమాచారం. ఇవాళ సాయంత్రం కుప్పం పర్యటన ముగించుకొని బెంగళూరు విమానాశ్రయానికి బయలుదేరనున్నారు సీఎం చంద్రబాబు.