శ్వేతపత్రాల విడుదలపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు..

శ్వేతపత్రాల విడుదలపై ఫోకస్ పెట్టిన సీఎం చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజు నుండే వరుస సమీక్షలు నిర్వహిస్తూ పాలనాపరమైన ప్రక్షాళన దిశగా అడుగులేస్తున్నారు.సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం 5కీలక హామీలకు సంబందించిన ఫైళ్లపై తొలి సంతకాలు చేసిన సీఎం, వాటి అమలుపై దృష్టి పెట్టారు.జూలై 1వ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో హామీ ఇచ్చిన ప్రకారం పెంచిన పెన్షన్ పంపిణీ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఎదురుకోకుండా ఉండే దిశగా ఆలోచన చేస్తోంది ప్రభుత్వం.

ఈ క్రమంలో శ్వేతపత్రాల విడుదలపై చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.8 అంశాలపై శ్వేతపత్రం విడుదల చేసే దిశగా చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం. శ్వేతపత్రాల రూపకల్పనపై మంత్రులతో కమిటీ వేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో శ్వేతపత్రాల విడుదల కీలకం కానుందని చెప్పాలి.