
చిన్నచింతకుంట, వెలుగు: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి తండ్రి జి.కృష్ణారెడ్డి ఇటీవల మృతి చెందారు. ఆదివారం ఎమ్మెల్యే స్వగ్రామం చిన్నచింతకుంట మండలం దమగ్నాపూర్ లో దశదినకర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి ఆయన హెలికాప్టర్ ద్వారా దమగ్నాపూర్ శివారులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో ఎమ్మెల్యే ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం కృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, జి.చిన్నారెడ్డి, మల్లు రవి, చల్లా వంశీ చంద్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.