కర్ణాటక జేడీఎస్ అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంను పార్టీ నుంచి తక్షణమే బహిష్కరిస్తున్నట్లు జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ ప్రకటించారు. రాష్ట్ర కార్యవర్గాన్ని రద్దు చేసి, తన కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామిని పార్టీ రాష్ట్ర శాఖ తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. గత రెండు రోజులుగా, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ)లో చేరాలనే పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇబ్రహీం గళం విప్పారు. బీజేపీతో చేతులు కలిపినందుకు పార్టీ నాయకత్వంపై ఆయన తిరుగుబాటు వైఖరితో ఆ పార్టీ హైకమాండ్ భగ్గుమంది.
‘‘పార్టీని బలోపేతం చేసేందుకు ఈరోజు మా జాతీయ అధ్యక్షుడు పాత యూనిట్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుని, నా నాయకత్వంలో తాత్కాలిక కమిటీని ప్రకటించారు.. అది ఆయనకు (సీఎం ఇబ్రహీం) తెలియజేస్తాం.. అది మా బాధ్యత. పార్టీని బలోపేతం చేయడం... పార్టీని అభివృద్ధి చేయడంపైనే మా దృష్టంతా'' అని కుమారస్వామి అన్నారు.
రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ-జేడీఎస్ కూటమిని ఇబ్రహీం తీవ్రంగా వ్యతిరేకించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటు చేసుకుంది. ఇబ్రహీం అక్టోబర్ 16న జేడీ(ఎస్)లోని 'సమాన భావాలు' గల వ్యక్తులతో సమావేశం నిర్వహించి, తన నేతృత్వంలోని పార్టీ అసలైనదని ప్రకటించారు. బీజేపీతో జేడీ(ఎస్) వెళ్లరాదని పార్టీ అధిష్టానానికి మెమోరాండం సమర్పించేందుకు కోర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్ 17న జేడీఎస్ నాయకుడు కుమారస్వామి బీజేపీతో భాగస్వామ్యం కోసం పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగురవేసినందుకు ఇబ్రహీంపై కఠినమైన చర్యలు తీసుకుంటామని సూచించాడు.
#WATCH | Former Karnataka CM & JD(S) leader HD Kumaraswamy says, "To strengthen the party, our national president today took the decision to dissolve the old unit and announced the ad-hoc committee in my leadership... Naturally, it will be communicated to him (CM Ibrahim)...My… https://t.co/Gv9RERV0qv pic.twitter.com/zGnVvQ3PyG
— ANI (@ANI) October 19, 2023
