టికెట్ల ధరలపై త్వరలోనే జీవో ఇస్తామని సీఎం చెప్పారు

టికెట్ల ధరలపై త్వరలోనే జీవో ఇస్తామని సీఎం చెప్పారు

ఏపీ సినీ పరిశ్రమ సమస్యలపై వారం పది రోజుల్లో నిర్ణయం తీసుకుంటానని సీఎం జగన్ హామీ ఇచ్చారన్నారు సినీనటుడు చిరంజీవి. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లిన ఆయన.. గంటలన్నరపాటు సమావేశమయ్యారు. టికెట్ల ధరలపై త్వరలోనే జీవో ఇస్తామని సీఎం చెప్పారన్నారు చిరంజీవి. సినీ పరిశ్రమకు సంబంధించిన అన్ని వర్గాల సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లాలని.. ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. సీఎంతో చర్చించిన అంశాలను ఇండస్ట్రీలోని మిగతా వారి దృష్టికి తీసుకెళ్తానన్నారు. జగన్ తో భేటీ తర్వాత.. గన్నవరం ఎయిర్ పోర్టులో ఆయన మీడియాతో మాట్లాడారు.