9 ఏoడ్లల్లో 60 శాతం ప్రజలకు.. బడ్జెట్​లో 2 శాతమే

9 ఏoడ్లల్లో 60 శాతం ప్రజలకు.. బడ్జెట్​లో 2 శాతమే


ప్రస్తుత ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈ సంవత్సరం రూ.30 వేల కోట్ల వడ్డీ (ప్రతి నెల 2500 కోట్లు) కట్టాల్సి వస్తున్నది. రాష్ట్ర ఆదాయంలో 20 శాతం మిత్తీలకే పోతున్నది. బతుకమ్మ చీరలు, కేసీఆర్ కిట్లు, కల్యాణ లక్ష్మి అంతా కలిపితే సంవత్సరం బడ్జెట్లో 2శాతం కూడా కాదు. రాష్ట్ర జనాభాలో 60 శాతానికిపైగా ఉన్న పేదల సంక్షేమానికి తొమ్మిదేండ్లుగా ఈ పాలకులు చేస్తున్న ఖర్చు బడ్జెట్ లో 2శాతం నిధులు మాత్రమే. 

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్యం, పరిశ్రమల అభివృద్ధితో పాటు పేద ప్రజల జీవన విధానం మెరుగుపరచడానికి సంక్షేమ పథకాలు శాస్త్రీయ పద్ధతిలో అమలుపరచాలి.. కానీ అవేవి జరగలేదు. ఐదున్నర లక్షల కోట్ల అప్పు చేసి.. ఆదాయాన్ని పెంచే ఉపయోగకరమైన పనులు చేయకపోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తు అంతా అంధకారంగా మారిపోయే పరిస్థితి వచ్చింది. అప్పులు చేసి ఈ నాయకులు వెళ్లిపోతారు. ఈ అప్పుల వడ్డీల భారం అంతా పేద ప్రజలపై, భవిష్యత్తు తరాలపై పడుతుంది.

- ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ