కొత్త అర్బన్ పాలసీ, రెవెన్యూ పాలసీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు

కొత్త అర్బన్ పాలసీ, రెవెన్యూ పాలసీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు

అర్బన్ పాలసీతో పాటు కొత్త రెవెన్యూ పాలసీని కూడా రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. కొత్త అర్బన్ పాలసీలో భాగంగా.. కొత్త మున్సిపల్ చట్టం, కొత్త కార్పొరేషన్స్ చట్టం, హైదరాబాద్ నగర కార్పొరేషన్ చట్టం రూపొందించాలని, HMWAతో పాటు ఇతర నగరాల అభివృద్ధి సంస్థల పాలనకు సంబంధించి కూడా కొత్త చట్టం రూపొందించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. దీంతో త్వరలోనే అసెంబ్లీని సమావేశ పరిచి చట్టాలు తీసుకొస్తామని కేసీఆర్ తెలిపారు.