ఖమ్మం జిల్లాపై సీఎం వరాల జల్లు

ఖమ్మం జిల్లాపై సీఎం వరాల జల్లు

ఖమ్మం జిల్లా  బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు భారీ సంఖ్యలో జనం హాజరుకావడం ప్రబలమైన మార్పునకు సంకేతమని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం చరిత్రలో ఇంత పెద్ద సభ ఎప్పుడూ జరగలేదన్న ఆయన.. కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆవిర్భావ సభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం జిల్లాపై వరాల జల్లు కురిపించారు. 

జిల్లాలోని 589 గ్రామ పంచాయితీలకు ముఖ్యమంత్రి నిధి నుంచి రూ.10 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం మున్సిపాలిటీకి రూ. 50 కోట్లు, ఇతర మున్సిపాలిటీలకు రూ. 30కోట్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. సత్తుపల్లి, మధిర, వైరాలను సైతం ఖమ్మం మున్సిపాలిటీ తరహాలో అభివృద్ధి చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఖమ్మంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. జిల్లాలోని జర్నలిస్టులకు నెల రోజుల్లో ఇండ్ల స్థలం కేటాయించాలని మంత్రి హరీష్ రావు, పువ్వాడ అజయ్ కు సూచించారు.