
హైదరాబాద్: డిసెంబర్ రెండో వారంలో కేంద్రానికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించనున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. దేశంలో బీజేపీ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, బీజేపీపై హైదరాబాద్ నుంచే యుద్ధం ప్రకటిస్తామని అన్నారు . జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో టీఆర్‌ఎస్ భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ రెండో మాసంలో బీజేపీ వ్యతిరేక పార్టీల నేతలతో హైదరాబాద్‌లోనే సమావేశం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ సమావేశానికి సీఎం మమతా బెనర్జీ, మాజీ సీఎంలు కుమార స్వామి, అఖిలేశ్ యాదవ్, మాయావతితో పాటు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు.